‘విద్యా వలంటీర్’కు భారీ డిమాండ్
10,887పోస్టులకు 1.33లక్షల దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: విద్యా వలంటీర్ పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఒక్కో పోస్టు కు సరాసరిన 12మందికి పైగా పోటీపడు తున్నారు. కొన్ని జిల్లాల్లో ఒక్కో పోస్టుకు 30 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 10,887పోస్టులకు 1,33,903 మంది దరఖా స్తులు పంపారు. అయితే పాఠశాల యూనిట్ గా ఆ గ్రామంలోని వారికే ప్రథమ ప్రాధాన్య మిస్తారు. ఆ తరువాత ఆ మండలానికి చెందిన వారికే ప్రాధాన్యం ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారిలో స్థానికులకే ఆ పోస్టులను కేటాయించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. స్థానికంగా ఎవరూ లేకపోతే తమకు అవకాశం వస్తుందన్న ఆశతో అనేక మంది ఇతర మండలాలకు చెందిన వారు కూడా విద్యా వలంటీర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇక్కడ పోటీ ఎక్కువ...
వరంగల్ అర్బన్ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యా వలంటీర్ పోస్టులకు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆయా జిల్లాల్లో ఒక్కో పోస్టుకు 29 మంది వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లాలోనూ అదే పరిస్థితి. నాగర్ కర్నూలు జిల్లాలో మాత్రం ఒక్కో పోస్టుకు 9 మందే దరఖాస్తు చేసుకున్నారు. సంగారెడ్డిలో ఒక్కో పోస్టుకు 8 మంది వరకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. కొత్తగా ప్రారంభిం చబోతున్న 84 కేజీబీవీల్లో 600 వరకు కాంట్రాక్టు రెసిడెంట్ టీచర్ (సీఆర్‌టీ), స్పెషల్ ఆఫీసర్ (ఎస్‌వో) పోస్టులకు 28 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.