తెలంగాణ, ఏపీలో మళ్లీ వర్షాలు
ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్ గఢ్, విదర్భపై అల్పపీడనం ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం కారణంగా రేపు(ఆదివారం) తెలంగాణలో విస్తారంగా కురుస్తాయని, ఏపీలోని కోస్తా ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. విదర్భ నుంచి దక్షిణ కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది.
ఇప్పటికే కోస్తా తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు పడే అవకాశాలున్నందున వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో అన్ని జిల్లాల్లో, ఏపీలో కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.