ఉప్పల్ స్టేడియంలో జరగబోయే ఐపీఎల్ మ్యాచ్‌లకు భారీ భద్రత కల్పించనున్నట్లు సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ నెల 16, 18, 23, 26, 30 మే 6, 12 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయని ఆయన చెప్పారు. మొత్తం రెండువేల మంది సిబ్బందిని భద్రతకు వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు. ఇందులో 1,129 సిటీ పోలీసులతోపాటు 270 ట్రాఫిక్, 2 అక్టోపస్ బృందాలు, 5 ప్లటూన్ల సాయుధ దళాలు, వివిధ విభాగాలకు చెందిన 250 మంది, ఫైర్ సిబ్బంది రెండు బృందాలు, ప్రైవేటు సెక్యూరిటీ సంస్థల నుంచి 200 మంది ఇందులో ఉంటారని వివరించారు.
ఐపీఎల్ మ్యాచ్‌లకు భారీ భద్రత
Published Thu, Apr 14 2016 5:28 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement