పోలీస్ శాఖలో భారీగా పదోన్నతులు
- 80 అదనపు ఎస్పీ, నాన్‌కేడర్ ఎస్పీ, 170 డీఎస్పీ ప్రమోషన్లు
- తాత్కాలిక పద్ధతిన ఇచ్చేందుకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో భారీగా పదోన్నతులు కల్పించే ప్రక్రియ ప్రారంభమైంది. కొన్నేళ్లుగా వివాదాస్పదం గా ఉన్న ఇన్‌స్పెక్టర్ల సీనియారిటీ జాబితా జీవో నం.54 ఓ కొలిక్కి రావడంతో.. పోలీస్ శాఖ పదోన్నతులకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇన్‌స్పెక్టర్ల ర్యాంక్ నుంచి నాన్ కేడర్ ఎస్పీ వరకు పదోన్నతులు కల్పించనున్నట్టు ఉన్నతాధికారులు చెప్పారు. రాష్ట్రంలోని 2 జోన్లలోనూ ఈ ప్రమోషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జీవో నంబర్ 54 సమీక్ష తర్వాత 170 మంది ఇన్‌స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పించేందుకు మార్గం సుగమమైందన్నారు. డీఎస్పీ, అదనపు ఎస్పీలు 80 మందిని అదనపు ఎస్పీ, నాన్‌కేడర్ ఎస్పీకి ప్రమోట్ అవుతారని శాఖ వర్గాలు తెలిపాయి. సీనియారిటీ జాబితాపై పలు కోర్టుల్లో కేసులున్నందున పదోన్నతులన్నీ తాత్కాలిక పద్ధతిన ఇస్తున్నామన్నారు.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు...
గతంలో ఉన్న సూపర్‌న్యూమరీ పోస్టులు పోనూ, కొత్త జిల్లాలు, కొన్ని అదనపు పోస్టుల ఏర్పాటును దృష్టిలో పెట్టుకొని పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో డీజీపీ అనురాగ్‌శర్మ కోరారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్‌తో డీజీపీ చర్చించి నట్టు తెలిసింది. దీంతో త్వరలోనే పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ వస్తుందని భావిస్తున్నట్టు పోలీస్ శాఖ వర్గాలు తెలిపాయి.
మరి విభజన సంగతేంటి?
రాష్ట్ర స్థాయి అధికారులైన సివిల్ డీఎస్పీలు, అదనపు ఎస్పీలు, నాన్‌కేడర్ ఎస్పీల పూర్తిస్థాయి విభజన జరగ లేదు. ఈ అంశంపై కోర్టులో స్టే ఉండటంతో కమల్‌నాథన్ కమిటీ విభజనను పక్కనపెట్టింది. అధికారుల విభజన పూర్తి కాకుండా అదనపు ఎస్పీ, నాన్ కేడర్ ఎస్పీ పదోన్న తులు ఇవ్వడం వివాదాస్పదంగా మారే అవకాశం ఉందని తెలంగాణ అధికారులు భావిస్తున్నారు. డీఎస్పీల సీనియా రిటీ జాబితా ఉన్న జీవో నం.108పై సమీక్ష జరగకపోవ డం మరో వివాదంగా మారుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జీవోపైనా కోర్టులో కేసులుం డటంతో అడ్‌హాక్ పద్ధతిన ప్రమోషన్లు ఇవ్వడంపై... బాధి త అధికారులు కోర్టుకెళ్లే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.