అలాంటోళ్లకు బండిస్తే యజమానికి జైలే! | hyderabad traffic police made strict rools over driving licenses | Sakshi
Sakshi News home page

అలాంటోళ్లకు బండిస్తే యజమానికి జైలే!

Published Wed, Feb 10 2016 6:29 PM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM

అలాంటోళ్లకు బండిస్తే యజమానికి జైలే! - Sakshi

అలాంటోళ్లకు బండిస్తే యజమానికి జైలే!

హైదరాబాద్: ఫ్రెండే కదా.. తెలిసినవాడే కదాని లైసెన్స్ లేకున్నాసరే బండి చేతికిస్తే.. మీ చేతికి సంకెళ్లు, మీకు జైలు తప్పదని హెచ్చరిస్తున్నారు పోలీసులు! లెసెన్స్ లేనివారు డ్రైవింగ్ చేయడమేకాదు, అది లేనివారికి వాహనం ఇవ్వడం కూడా నేరంగానే పరిగణిస్తామని చెబుతున్నారు. టూ, త్రీ, ఫోర్ వీలర్ వాహనాలన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేశారు.

నగరంలో లైసెన్స్ లు లేకుండా వాహనాలు నడిపి పట్టుబడ్డ 300 మందికి గోషామహల్ ట్రాఫిక్ శిక్షణా కేంద్రంలో పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎ.వి.రంగనాథ్.. డ్రైవింగ్ లెసైన్సులు లేనివారికి వాహనాలు ఇస్తే డ్రైవర్‌తో పాటు యజమాని కూడా జైలుశిక్ష అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం మూడుసార్లకు మించి పట్టుబడే వాహనదారుల లెసైన్సులు రద్దు చేస్తామన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లు లేని ఆటోడ్రైవర్‌లు ఈ నెల 15లోగా వాటిని పొందాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement