
బీమా సొమ్ము రైతులకు అందడంలేదు: గవర్నర్
హైదరాబాద్ : రైతులకు బీమా డబ్బులు సక్రమంగా అందడంలేదని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన జాతీయ వినియోగదారుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ.. వినియోగదారుల అవగాహన సదస్సులు పల్లెల్లో నిర్వహిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. ప్రకటనలతో రైతులకు భరోసా కల్పించలేకపోతున్నామని గవర్నర్ అన్నారు.