Insurance money
-
ఇన్సూరెన్స్ డబ్బు కోసం చావు డ్రామా
పాములపాడు: నంద్యాల జిల్లా పాములపాడులోని ఏకే ట్రేడర్స్ గోదాంలో ఈ నెల 1న రాత్రి మంటల్లో సజీవ దహనమైన వ్యక్తిగా భావించిన ఫారుక్‌బాషా బతికే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ రోజు రాత్రి సజీవ దహనమైన వ్యక్తి పాములపాడు మండలం చెలిమిల్ల గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని శెట్టి ప్రతాప్‌గా గుర్తించారు. అప్పుల్ని ఎగ్గొట్టడంతోపాటు ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఫారూక్‌బాషా తాను చనిపోయినట్టుగా చిత్రీకరించాడని తేలింది. వివరాల్లోకి వెళితే.. పాములపాడుకు చెందిన ఫారుక్‌బాషా ధాన్యం వ్యాపారం చేసేవాడు. అతడు రైతులకు దాదాపు రూ.కోటి వరకు బకాయి పడినట్టు తెలుస్తోంది. అప్పులు తీర్చకుండా ఎగ్గొట్టడంతోపాటు రూ.50 లక్షల ఇన్సూరెన్స్ సొమ్ము రాబట్టేందుకు ఫారుక్‌బాషా చనిపోయినట్టు నమ్మించాడు. అతడి కుటుంబ సభ్యులు కూడా మంటల్లో మరణించిన వ్యక్తి ఫారుక్‌బాషానే అని నిర్ధారించడంతో పోలీసులు పంచనామా నిర్వహించి.. మృతదేహాన్ని కుటుంబ çసభ్యులకు అప్పగించారు. మృతదేహానికి అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. మహిళ ఫిర్యాదుతో వెలుగులోకి.. కాగా.. చెలిమిల్ల గ్రామానికి చెందిన శెట్టి ప్రతాప్ అదృశ్యమైనట్టు అతడి భార్య స్వరూప ఈ నెల 4న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా మంటల్లో లభ్యమైన మృతదేహం ఆనవాళ్లను ఆమెకు చూపించగా.. చొక్కా, ఇతర ఆనవాళ్లను బట్టి తన భర్తగానే గుర్తించింది. ఫారుక్‌బాషా తన భర్తను సజీవ దహనం చేశాడని ఆరోపించింది. దీంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మృతదేహం శెట్టి ప్రతాప్‌దేననే నిర్ధారణకు వచ్చారు. అప్పటికే ఫారుక్‌బాషా పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతడు హైదరాబాద్‌లో ఉన్నాడని తెలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయమై ఎస్ఐ అశోక్‌ను వివరణ కోరగా.. దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
బీమా డబ్బు కోసం భార్యతో కలిసి.. కన్న తల్లినే..
పాపన్నపేట (మెదక్): రైతు బీమా డబ్బులకు ఆశపడి కన్నతల్లినే చంపాడో కిరాతకుడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో వెలుగుచూసింది. అన్నారం గ్రామానికి చెందిన ధనమ్మోల్ల శంకరమ్మ (57) పేరిట 23 గుంటల భూమి ఉంది. జీవనోపాధి కోసం కొడుకు ప్రసాద్‌కు ఆటో కొనిచ్చింది. దురలవాట్లకు బానిసైన కొడుకు డబ్బుల కోసం తరచూ తల్లితో గొడవ పడేవాడు. ఈ క్రమంలో తల్లిని చంపితే రైతు బీమాతో పాటు డ్వాక్రా గ్రూపు బీమా డబ్బు వస్తుందని దురాలోచన చేశాడు. భార్య కవితతో కలిసి ఆగస్టు 29 తెల్లవారుజామున నిద్రలో ఉన్న శంకరమ్మను కండువాతో ఉరివేసి హతమార్చాడు. దీనిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. కానీ శంకరమ్మ మెడపై గాట్లు ఉండటం చూసిన ఆమె కూతుళ్లు మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీ సులు విచారించగా.. శంకరమ్మను తామే హత్య చేసినట్లు కొడుకు, కోడలు అంగీకరించారు. చదవండి: కోరుట్ల దీప్తి కేసులో కీలక పరిణామం -
బీమా సొమ్ము కోసం మర్డర్ ప్లాన్: కేసులో పురోగతి.. చనిపోయిన వ్యక్తి వివరాలివే..
ఖలీల్‌వాడి (నిజామాబాద్): రూ. లక్షల్లో ఉన్న అప్పులను బీమా సొమ్ముతో తీర్చేందుకు ఓ ప్రభుత్వోద్యోగి తన లాంటి వ్యక్తిని హత్య చేసి కారు సహా మృతదేహాన్ని దహనం చేసిన కేసులో మృతుడు బాబు స్వస్థలాన్ని పోలీసులు గుర్తించారు. బాబు మారోతి గలగాయే (42) మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోకర్ తాలుకా లాగలూద్ గ్రామానికి చెందిన వాడని పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులు ధర్మానాయక్, అతని మేనల్లుడు తేజవత్ శ్రీనివాస్ కలిసి నిజామాబాద్ రైల్వేస్టేషన్ నుంచి అడ్డా కూలీ అయిన బాబును గత వారం మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలోని వెంకటాపూర్ చెరువు వద్దకు కారులో తీసుకెళ్లి హతమార్చడం... ఆపై కారుతోపాటు మృతదేహంపై పెట్రోల్ పోసి దహనం చేయడం తెలిసిందే. ఈ కేసులో బాబు కనిపించట్లేదంటూ నిజామాబాద్ కమిషరేట్ పరిధిలోని పోలీసు స్టేషన్లలో ఎటువంటి మిస్సింగ్ కేసు నమోదు కాకపోవడంతో అతని స్థానికతను కనుగొనేందుకు పోలీసులు వివిధ రైల్వేస్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోకర్ రెల్వేస్టేషన్‌లో బాబు రైలు ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించడంతో సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఆరా తీశారు. కూలి పనుల కోసం నిజామాబాద్‌లో అతను రైలు దిగినట్లు మృతుని కుటుంబ సభ్యులను విచారించి తెలుసుకున్నారు. మరోవైపు బాబుకన్నా ముందు ధర్మానాయక్ చంపాలనుకున్న నాంపల్లికి చెందిన అంజయ్య అనే వ్యక్తి ఎందుకు, ఎలా తప్పించుకొని పారిపోయాడనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అంజయ్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను తీసుకువెళ్లినట్లు సమాచారం. అతన్ని మెదక్ పోలీసులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. -
పనికోసం నమ్మి వెళ్తే.. ‘బీమా’ ప్లాన్‌లో శవమయ్యాడు.. పాపం ఆ డ్రైవర్!
సాక్షి, మెదక్/హైదరాబాద్: మెదక్ కారు దహనం కేసులో అనూహ్య ట్విస్ట్ నెలకొన్న విషయం తెలిసిందే. చనిపోయాడనుకున్న వ్యక్తి బతికే ఉన్నట్లు తేలింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం నాటకం ఆడి సెక్రెటేరియేట్ ఉద్యోగి ధర్మా అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. అయితే ధర్మా ఆడిన నాటకంలో డ్రైవర్ బలి పశువుగా మారాడు. పనికి వెళ్తే నాలుగు పైసలు వస్తాయని ఆశించిన వ్యక్తి ఊహించని విధంగా విగతజీవిగా మారి ఈ లోకాన్నే విడిచి వెళ్లాడు. చనిపోయింది ఎవరు ? ధర్మానాయక్‌కు రెగ్యులర్ డ్రైవర్ లేడు. ఈ నెల 4న ధర్మా హైదరాబాద్‌లోని అడ్డాపై ఉన్న బిహార్‌కు చెందిన ఓ వ్యక్తిని రోజువారీ కిరాయి ఇస్తానని కారు డ్రైవర్‌గా పనిలో పెట్టుకున్నట్టు తెలుస్తోంది. తెలిసిన వ్యక్తిని కారు డ్రైవర్‌గా పెట్టుకుంటే చంపడం కుదరదనుకుని ఇలా ప్లాన్ చేశాడు. 8వ తేదీన డ్రైవర్‌కు ఫుల్‌గా మద్యం తాగించిన తర్వాత గొడ్డలితో నరికిచంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆపై కారులో ఆ డ్రైవర్ మృతదేహాన్ని ఉంచి పెట్రోల్ పోసి తగులబెట్టినట్టు పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే ఇదంతా చేశాడని, దీని కోసమే రెండు నెలల క్రితం సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేశాడు. డ్రైవర్‌తో సహా కారును సజీవదహనం చేశాక ధర్మానాయక్ జరిగిన విషయాన్ని భార్యకు చెప్పిన తర్వాత సమీప అటవీ ప్రాంతం గుండా షాబాద్ తండాకు చేరుకున్నాడు. అక్కడి నుంచి మరో వాహనంలో పరారయ్యాడు. మృతుడి స్వస్థలం బీహార్‌గా భావిస్తున్నారు. నవీన్‌పేటలో స్కెచ్ ధర్మానాయక్ అక్క నిజామాబాద్ జిల్లాలోని నవీన్‌పేటలో ఉంటుంది. అక్క కొడుకుతో కలిసి ఇన్సూరెన్స్ డబ్బు కోసం పథకం వేసినట్టు ప్రచారం జరుగుతోంది. సహకరిస్తే పెళ్లికి సాయంతోపాటు, కొంతడబ్బు కూడా ముట్టజెప్పుతానని ఆశ చూపినట్టు సమాచారం. బెట్టింగ్‌లు ఆడి... ధర్మా కొంతకాలంగా ఆన్లైన్ గేమ్స్‌తోపాటు బెట్టింగ్‌లు ఆడి సుమారు రూ.2 కోట్ల వరకు పోగొట్టుకున్నట్లు తెలిసింది. దీంతో తెచ్చిన అప్పులను తీర్చే మార్గం కానరాక భారీ స్కెచ్ వేశాడు. తన పేరుపై ఉన్న 4 ఎల్ఐసీ పాలసీల క్లెయిమ్ విలువ రూ.7 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రమాదంలో చనిపోయింది ధర్మానే అనేవిధంగా నమ్మించి బీమా డబ్బులు పొందాలని చూశాడు. కాగా, ధర్మానాయక్ తమ అదుపులోనే ఉన్నాడని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని చెప్పారు. కారు దహన ఘటనపై విచారిస్తున్నామని, బుధవారం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. మండిపడుతున్న తండావాసులు డబ్బు కోసం ధర్మానాయక్ ఈ ఘటనకు ఒడిగట్టడంపై తండావాసులు మండిపడుతున్నారు. మంగళవారం మీడియా బృందం తండాకు చేరుకొని ధర్మానాయక్ భార్య నీల, ఇతర కుటుంబసభ్యు లతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే వా రు నోరు మెదపలేదు. మెదక్ డీఎస్పీ, అల్లాదుర్గం సీఐ, మెదక్ సీఐ, టేక్మాల్ పోలీసులు ఘటనా స్థలానికి ధర్మా నాయక్‌ను తీసుకొచ్చి వివరాలు సేకరించినట్టు సమాచారం. ధర్మానాయక్ కస్టడీలో ఉన్నా తమకేమీ సమాచారం లేదంటూ పోలీసులు సమాధానం ఇస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే ఈనెల 9న టేక్మాల్ మండలం వెంకటాపూర్ చెరువు కట్ట సమీపంలో కారులో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఆ కారు సెక్రెటేరియేట్లో పనిచేసే ధర్మనాయక్‌ది అని, చనిపోయిందని అతనేనని భావించారు. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు అనేక సందేహాలు రేకెత్తాయి. కారు దహనమైన చోట పెట్రోల్ బాటిల్ ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ధర్మానాయక్ కుటుంబసభ్యుల ఫోన్ కాల్స్, మెసేజ్‌ల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టడంతో కేసు మరో మలుపు తిరిగింది. డెత్ సర్టిఫికెట్ తీసుకోమంటూ ధర్మానాయక్ చేసిన మెసేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరపగా.. చనిపోయింది ధర్మానాయక్ కాదనే ఓ అంచనాకు వచ్చారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పూణే సమీపంలో ధర్మానాయక్ ఉన్నట్టు గుర్తించారు. మంగళవారం టేక్మాల్‌కు తీసుకొచ్చి పోలీసులు విచారించారు. ఆపై మెదక్‌కు తరలించారు. -
బీమా డబ్బుల కోసం డ్రామా
మెదక్‌జోన్: కారుతోసహా వ్యక్తి సజీవదహనమైన కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. చనిపోయాడనుకున్న వ్యక్తి బతికే ఉన్నట్లు తేలింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం నాటకం ఆడి అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన వివరాలు.. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బీమ్లా తండాకు చెందిన ధర్మానాయక్ సెక్రెటేరియేట్‌లోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నెల 5న స్వగ్రామానికి వచ్చా డు. 6న మిత్రులతో కలిసి బాసరకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. 7న రాత్రి ఇంటికొస్తున్నానని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. 8వ తేదీ రాత్రి వెంకటాపూర్ గ్రామ శివారులో ధర్మా కారుతో సహా కాలిపోయాడనే సమాచారం అందింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పక్కనే ఖాళీ పెట్రోల్ బాటిల్ గుర్తించారు. దీంతో ధర్మా ప్రమాదంలో చనిపోయాడా? ఎవరైనా హత్య చేశారా.. అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మెస్సేజ్ ఆధారంగా గుర్తింపు.. విచారణ ప్రారంభించిన పోలీసులు ధర్మా భార్య నీల ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ధర్మా పుణెకు వెళ్లి తన భార్య ఫోన్‌కు తన డెత్ సర్టి ఫికెట్ తీసి ఇన్సూరెన్స్ డబ్బులకు దరఖాస్తు చేయాలని మెస్సేజ్ పంపాడు. దీని ఆధారంగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. పోలీసులు పుణెలో ధర్మాను అరెస్ట్‌చేశారు. భార్యభర్తలిద్దరూ కలిసే ఈ స్కెచ్ వేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ నెల 4న ధర్మా హైదరాబాద్‌లోని అడ్డాపై ఉన్న బిహార్‌కు చెందిన ఓ వ్యక్తిని కారు డ్రైవర్‌గా పనిలో పెట్టుకున్నట్టు తెలుస్తోంది. తెలిసిన వ్యక్తిని కారు డ్రైవర్‌గా పెట్టుకుంటే చంపడం కుదరదనుకుని ఇలా ప్లాన్ చేశాడు. ధర్మా 8వ తేదీన డ్రైవర్‌కు ఫుల్‌గా మద్యం తాగించిన తర్వాత గొడ్డలితో నరికిచంపి, ఆపై కారులో మృతదేహాన్ని ఉంచి పెట్రోల్ పోసి తగులబెట్టినట్టు అనుమానిస్తున్నారు. దీనిపై ధర్మాను పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నట్టు తెలిసింది. బెట్టింగ్‌లు ఆడి... ధర్మా కొంతకాలంగా ఆన్లైన్ గేమ్స్‌తోపాటు బెట్టింగ్‌లు ఆడి సుమారు రూ.2 కోట్ల వరకు పోగొట్టుకున్నట్లు తెలిసింది. దీంతో తెచ్చిన అప్పులను తీర్చే మార్గం కానరాక భారీ స్కెచ్ వేశాడు. తన పేరుపై ఉన్న 4 ఎల్ఐసీ పాలసీల క్లెయిమ్ విలువ రూ.7 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రమాదంలో చనిపోయింది ధర్మానే అనేవిధంగా నమ్మించి బీమా డబ్బులు పొందాలని చూశాడు. కాగా, ధర్మానాయక్ తమ అదుపులోనే ఉన్నాడని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని చెప్పారు. కారు దహన ఘటనపై విచారిస్తున్నామని, బుధవారం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
కారుతో తొక్కించి.. దారుణంగా హతమార్చి..
షాద్‌నగర్: బీమా డబ్బులు కాజేసేందుకు నలుగురు వ్యక్తులు డ్రామా ఆడారు. యువకుడిని హాకీ స్టిక్‌తో కొట్టి నడిరోడ్డుపై పడేసి కారుతో తొక్కించి దారుణంగా హత్య చేశారు. ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. ఏడాది క్రితం జరిగిన ఈ కేసును పోలీసులు ఛేదించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని మొగిలిగిద్ద శివారులో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి కేసును షాద్‌నగర్ పోలీసులు ఛేదించి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ వివరాలను సోమవారం షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి వెల్లడించారు. కంపెనీ ఏర్పాటు చేసి.. : వరంగల్ జిల్లా చెన్నారావు పేట మండలం బోడ తండాకు చెందిన బోడ శ్రీకాంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కొంతకాలంగా హైదరాబాద్ బాచుపల్లిలోని శ్రేష్ట రెసిడెన్సీలో నివాసం ఉంటున్నాడు. ఓ కంపెనీ ఏర్పాటు చేసి ఫేక్ ఉద్యోగాలు సృష్టించాడు. పని చేస్తామంటూ వచ్చిన వారి పేర్లపై క్రెడిట్‌కార్డులు తీసుకొని, వాటి ద్వారా డబ్బులు తీసుకుంటూ బ్యాంకులను మోసం చేస్తూ విలాసవంతమైన జీవితం సాగిస్తున్నాడు. గుంటూరు జిల్లా నర్సంపేట మండలం గురజాల గ్రామానికి చెందిన భిక్షపతి అనే యువకుడు శ్రీకాంత్ వద్ద పని చేసేందుకు వచ్చాడు. అతడికి తల్లిదండ్రులు, తోబుట్టువులు లేరన్న విషయం తెలుసుకున్న శ్రీకాంత్.. అతడి పేరు మీద రూ.50లక్షల బీమా పాలసీ తీశాడు. పాలసీకి నామినీగా తన పేరు పెట్టుకున్నాడు. 2021లో ఐసీఐసీఐ బ్యాంకులో రూ.52 లక్షలు లోన్ తీసుకుని మేడిపల్లిలో ఓ ఇంటిని కొనుగోలు చేసి భిక్షపతి పేరున రిజిస్టర్ చేయించాడు. తర్వాత డబ్బులు అవసరం ఉండటంతో శ్రీకాంత్ ఆ ఇంటిని అమ్మకానికి పెట్టగా, భిక్షపతి అంగీకరించలేదు. దీంతో ఎలాగైనా అతడిని అంతమొందించాలనుకున్న శ్రీకాంత్ తనకు పరిచయం ఉన్న అప్పట్లో మల్కాజిగిరిలో హెడ్‌కానిస్టేబుల్‌గా (ప్రస్తుతం సైబరాబాద్ సీసీఎస్‌లో..) పనిచేస్తున్న మోతీలాల్‌ను కలిశాడు. తనకు సాయం చేస్తే రూ.10లక్షలు ఇస్తానని చెప్పడంతో భిక్షపతిని హత్య చేసేందుకు హెడ్‌కానిస్టేబుల్ పథకాన్ని రచించాడు. కారులో తీసుకెళ్లి హత్య : భిక్షపతిని హత్య చేసేందుకు శ్రీకాంత్ తన వద్ద పని చేస్తున్న మహబూబాబాద్ జిల్లా గూడురు మండలం రాముతండాకు చెందిన బానోతు సమ్మన్న, వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం జల్లి గ్రామానికి చెందిన చాగంటి సతీష్ సాయం తీసుకున్నాడు. సమ్మన్న, సతీష్ కు చెరో రూ.5లక్షల చొప్పున, హెడ్‌కానిస్టేబుల్‌కు రూ.10లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. 22 డిసెంబర్, 2021న నలుగురూ కలిసి భిక్షపతిని కారులో షాద్‌నగర్ పరిధిలోని మొగిలిగిద్దకి తీసుకొచ్చి మద్యం తాగించారు. తర్వాత భిక్షపతి తలపై హాకీ స్టిక్‌తో బలంగా కొట్టి కింద పడేశారు. అతనిపై నుంచి రెండుసార్లు కారును నడిపించి హతమార్చారు. బీమా క్లెయిమ్ కోసం దరఖాస్తు వచ్చినప్పుడు ఆ కంపెనీ ప్రతినిధులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ దిశగా పోలీసులు దర్యాప్తుచేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. çనలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ కుషాల్కర్ నేతృత్యంలోని సీఐ నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐలు వెంకటేశ్వర్లు, రాంబాబు, కానిస్టేబుల్స్ కేసును చేధించారు. -
బీమా డబ్బు కోసం భర్తను హత్య చేసిన భార్య
సాక్షి ప్రతినిధి, చెన్నై: వేదమంత్రాల సాక్షిగా మనువాడిన భర్త కంటే అతనిపై పేరు మీదున్న బీమా డబ్బే ఎక్కువైంది ఆమెకు. అప్పులు తీర్చేందుకు భర్త పేరున ఉన్న బీమా పాలసీ నగదుపై కన్నేసింది. భర్తపై పెట్రోలు పోసి తగలబెట్టి సజీవదహనం చేసింది. సజీవదహనాన్ని బంధువు సాయంతో ప్రమాదంగా చిత్రీకరించింది. చివరకు కేసు దర్యాప్తులో పోలీసులు ఎదుట నేరం అంగీకరించింది. ఈరోడ్ జిల్లా తుడుప్పదికి చెందిన రంగరాజన్(62) చేనేత పరిశ్రమతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. వ్యాపారాల్లో రూ.కోటికి పైగా నష్టాల పాలయ్యాడు. ఈనెల 8న హాస్పిటల్ నుంచి వ్యానులో తన భార్య జ్యోతిమణి (55), తన సోదరి అల్లుడు రాజా(40) రంగరాజన్‌కు తోడుగా వస్తున్నారు. పెరుమానల్లూరు సమీపంలో ఇంజిన్ భాగం నుంచి పొగవచ్చింది. తామిద్దరం కిందికి దిగి రంగరాజన్‌ను బయటకు తీసేలోగా మంటలు వ్యాపించి వ్యాన్‌లో కాలిపోయాడని పోలీసులకు జ్యోతిమణి, రాజా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో జ్యోతి, రాజా పొంతనలేని సమాధానాలు చెప్పడంతోపాటు వీరిద్దరికీ చిన్నపాటి కాలినగాయాలు లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. రంగరాజన్ కుమారుడు నందకుమార్ సైతం తన తండ్రి మృతిపై అనుమానం ఉందని పోలీసులకు చెప్పాడు. పోలీసులు తమదైన శైలిలో జ్యోతి, రాజాలను ప్రశ్నించడంతో చేసిన నేరాన్ని వారు అంగీకరించారు. రంగరాజన్‌కు రూ.1.50 కోట్ల అప్పు ఉంది. దీంతో గతంలో రంగరాజన్ రూ.3 కోట్లకు ప్రమాద బీమా చేసి నామినీగా భార్య జ్యోతిమణి పేరును పెట్టాడు. భర్తను హతమార్చి బీమా సొమ్మును కాజేయాలని వారు పథకం పన్నారు. దీనికి రాజాతో ఒప్పందం కుదుర్చుకుని జ్యోతి రూ.50వేలు ఇచ్చింది. ఓ పెట్రోలు బంక్ వద్ద క్యానులో పెట్రోల్ కొన్నారు. కొంతదూరం వెళ్లార నిర్మానుష్య ప్రాంతంలో వ్యాన్‌ను ఆపారు. నిద్రిస్తున్న రంగరాజన్‌పై, వ్యానుపై పెట్రోల్ పోసి నిప్పటించారు. రంగరాజన్ అగ్నికి ఆహుతయ్యాక అగ్నిమాపకదళానికి ఫోన్ చేసి ప్రమాదం జరిగిందని చెప్పారు. చదవండి: 13 ఏళ్ల బాలికకు పెళ్లి, గర్భం.. భర్తపై కేసు -
భార్యతో కలిసి మామను హత్య చేసిన అల్లుడు
నాగార్జునసాగర్: బీమా డబ్బు కోసం చోటుచేసుకున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆరేళ్ల క్రితం మృతిచెందిన వ్యక్తిది ప్రమాద మరణం కాదని.. హత్యేనని పోలీసుల విచారణలో వెల్లడైంది. బీమా డబ్బుల కోసమే కూతురు, అల్లుడు పథకం ప్రకారం మరికొందరి సహకారంతో ఘాతుకానికి ఒడిగట్టినట్లు తేలింది. సీఐ గౌరీనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం కుంకుడుచెట్టుతండాకు చెందిన రమావత్ బిక్నానాయక్(47) కొన్నేళ్ల క్రితం తన కూతురు బుజ్జిని దామరచర్ల మండలం పుట్టల గడ్డతండాకుచెందిన రూపావత్ చీనానాయక్ కుమారుడు భాష్యానాయక్‌కు ఇచ్చి వివాహం చేశాడు. ప్రస్తుతం తండాకు సర్పంచ్ ఈయనే. అయితే, భాష్యానాయక్ అప్పట్లోనే రమావత్ బిక్నానాయక్‌పై వివిధ రకాల ఇన్సూరెన్స్ పాలసీలు చేయడంతో పాటు అతడి పేరిట రెండు ట్రాక్టర్లు, బొలేరోను ప్రైవేట్ ఫైనాన్స్‌లో తీసుకున్నాడు. పథకం ప్రకారం.. బీమా పాలసీలు, వాహనాలపై ఉన్న ఫైనాన్స్ డబ్బులను చెల్లించకుండా ఉండేందుకు భాష్యానాయక్ మామ బిక్నానాయక్ను అంతమొందించేందుకు తన భార్య బుజ్జితో పథకం రచించాడు. అందుకు కల్లెపల్లికి చెందిన లావుడ్యా రాజేశ్వర్‌రావు, ధీరావత్ నరేష్, గాంధీనగర్‌కు చెందిన పోలగాని రవిల సహకారం తీసుకున్నాడు. రమావత్ బిక్నానాయక్కు 2015 ఫిబ్రవరి 22న రాత్రి మద్యం తాపారు. స్పృహకోల్పోయిన తర్వాత నెల్లికల్లు స్టేజీసమీపంలో రోడ్డుపై పడుకోబెట్టి ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేశారు. రిమాండ్‌కు తరలింపు బిక్నానాయక్ మృతిని భాష్యానాయక్ ప్రమాదంగా చిత్రీకరించి నాగార్జునసాగర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అదే తరహాలో పోలీసులు కేసు నమోదు చేశారు. బిక్నానాయక్‌పై ఉన్న పాలసీలతో రూపావత్ భాష్యానాయక్–బుజ్జిదంపతులు రూ.79,65,000లు లబ్ధిపొందారు. ఇటీవల బీమా సొమ్ము స్వాహాపర్వంలో పొలగాని రవి అరెస్ట్ కావడంతో భాష్యానాయక్ దంపతుల దారుణం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు బుధవారం కేసులో నిందితులైన భాష్యానాయక్, బుజ్జి, నాగేశ్వర్రావు, నరేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు. -
విద్యార్థిని దుర్మరణం..'ఇన్సురెన్స్ డబ్బుల కోసమే'
లక్నో: అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బులంద్‌షహర్‌కు చెందిన 20 ఏళ్ల సుధీక్షా భాటి అనే మహిళ రోడ్డు ప్రమాదంతో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ కేసుకి సంబంధించి కుటుంబసభ్యులు, పోలీసులు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. తాజాగా సుధీక్షా భాటి యాక్సిడెంట్ కేసులో ఓ కొత్త ట్విస్ట్ కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు. సుధీక్షా కుటుంబం ఆరోపిస్తున్నట్లు ఆకతాయి వేధింపుల వల్లే ప్రమాదం జరిగిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు. అంతేకాకుండా సుధీక్షా మెరిట్ స్టూడెంట్ అయినందున కేవలం ఇన్సురెన్స్ డబ్బుల కోసమే ఆమె కుటుంబం ఈ విధంగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇందుకు తమ దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. (విద్యార్థిని దుర్మరణం.. పలు అనుమానాలు) బులంద్‌షహర్ జిల్లాకు చెందిన సుదీక్ష భాటి(20) 2018లో సీబీఎస్సీ క్లాస్ 12 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. 98 శాతం మార్కులు సాధించి అమెరికాలోని మసాచుసెట్స్‌లో గల బాబ్సన్ కాలేజ్‌లో స్కాలర్‌షిప్‌నకు అర్హత సాధించింది. ఈ క్రమంలో అగ్రరాజ్యంలో విద్యనభ్యసిస్తున్న సుదీక్ష కరోనా వ్యాప్తి నేపథ్యంలో జూన్‌లో భారత్‌కు తిరిగి వచ్చింది. ఆగష్టులో మళ్లీ అక్కడికి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన పత్రాల కోసం సోమవారం తన అంకుల్‌తో కలిసి బైక్‌పై బంధువుల ఇంటికి బయల్దేరింది. ఇంతలో ఓ ఆకతాయి వాళ్ల బైక్‌ను వెంబండించాడు. వివిధ రకాల స్టంట్లు చేస్తూ సుదీక్ష ఉన్న బైక్‌ను ఢీకొట్టడంతో ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. తలకు తీవ్రమైన గాయం కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. సదరు బైకర్ కావాలనే తమ కూతురిని వెంబడించి యాక్సిడెంట్ చేశాడని సుదీక్ష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతడికి తగిన శిక్ష వేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా అసలు బైక్ నడిపింది సుధీక్షా అంకుల్ కాదని, ఆమె తమ్ముడని పోలీసులు అన్నారు. ఇతను మైనర్ అని, సరైన అనుభవం లేని కారణంగానే ప్రమాదం జరిగిందని అంటున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఘటన జరిగిన సమయంలో సుధీక్షా అంకుల్ వేరే ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. (గుడిని కాపాడేందుకు ముస్లింల మానవ హారం) -
భీమా డబ్బు కోసం భర్తను చంపేందుకు కుట్ర
-
ఇన్సురెన్స్ డబ్బుల కోసం..
నిజామాబాద్ క్రైం: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆశపడి కొడుకుచే దొంగతనాలు చేయించిందో తల్లి. అయితే.. ఆమె వ్యూహం బెడిసికొట్టడంతో కటకటాలపాలైంది. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌లోని నాందేవ్ వాడకు చెందిన కనుగంటి పద్మ ఇటీవల ఓ దుకాణంలో నాలుగు తులాల బంగారం కొనుగోలు చేసింది. చోరీకి గురైన సొత్తుపై 70 శాతం రికవరీ ఉంటుందని పేపర్లో చదివింది. ఏదో రకంగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో కొడుకుతో దొంగ అవతారం ఎత్తించింది. తన వ్యూహంలో భాగంగా పద్మ పూసలగల్లీకి కొడుకుతోనే వాహనంపై వెళ్లింది. రోడ్డుపై ఎవరూ లేని చోట ఉండిపోగా, ముఖంపై కారం చల్లి మెడలో నుంచి గొలుసును దొంగ ఎత్తుకుపోయినట్లు విలపించింది. ఆమె మాటలను నమ్మి పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలు అదే రోజు వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల ఆధారంగా దొంగతనానికి ఉపయోగించిన వాహనం యజమానిని పోలీసులు పట్టుకుని విచారించగా తన స్నేహితుడు విష్ణు సిద్దార్థకు ఇచ్చినట్లు తెలిపాడు. విష్ణును విచారించగా తన తల్లే తనతో దొంగతనం చేయించిందని చెప్పడంతో అసలు విషయం బయటపడింది. ఇన్సూరెన్సు డబ్బులకు ఆశపడి తానీ పథకం రచించినట్లు పద్మ అంగీకరించిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో తల్లి, కొడుకుపై కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్ఓ నాగేశ్వర్రావు తెలిపారు. -
ఖతర్నాక్ ప్లాన్.. అట్టర్ ప్లాప్!
సూరత్: కారు ఇన్సూరెన్స్ డబ్బు కొట్టేయాలని ఖతర్నాక్ ప్లాన్ చేసిన అడ్డంగా బుక్కయ్యాడో మాయగాడు. బీమా సొమ్మును అక్రమంగా బొక్కేందుకు కుట్రను పోలీసులు ఛేదించారు. గుజరాత్ లోని సర్తనా ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు బుధవారం కారును తగలబెట్టరారు. మంటల్లో దగ్ధమైన కారుపై పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి(పాస్) కన్వీనర్ హార్ధిక్ పటేల్ బొమ్మతో పాటు, పటేల్ రిజర్వేషన్ల పోరాటంలో మృతి చెందిన వారి ఫొటోలు ఉన్నాయి. పోలీసుల దర్యాప్తులో ఆశ్చర్యకర విషయాలు వెల్లడైయ్యాయి. కారు యజమాని దినేశ్ చొరాదియా మరో ఇద్దరితో కలిసి ఈ దురాగతానికి పాల్పడినట్టు గుర్తించారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన కారుకి తానే నిప్పుపెట్టాడు. దీనికి ముందు కారులోని విలువైన సామాన్లు తీసేసి.. కారుకు హార్ధిక్ పటేల్, ఇతరుల బొమ్మలు అతికించాడు. ఈ కారును దినేశ్ కు 2015లో పాస్ బహుమానంగా ఇచ్చింది. దినేశ్ కు సహకరించిన భవేశ్ దంగర్, నితిన్ దంగర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న దినేశ్ పట్టుబడితే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు అన్నారు. -
బీమా డబ్బులకు లంచమా..!
లేబర్ అధికారితో కార్మికుల వాగ్వాదం జన్నారం : భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అందజేసే బీమా డబ్బులు ఇవ్వడానికి, ఫైల్ ఆదిలాబాద్ పంపడానికి లేబర్ అధికారి హేమలత డబ్బులు అడుతున్నారని మండలంలోని భవన నిర్మాణ కార్మికులు ఆరోపించారు. బుధవారం కార్మికుల సభ్యత్వ నమోదుకు మంచిర్యాలకు చెందిన లేబర్ అధికారులు హేమలత, రవీందర్ మండలానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు ముల్కల్ల ప్రభాకర్‌తో పాటు కార్మికులందరు అక్కడికి వచ్చి నిరసన తెలిపారు. మండలంలోని బొంతల లక్ష్మణ్ భార్య నాగవ్వ, భూమయ్య భార్య ఎంకవ్వ, ఒకపల్లి లక్ష్మి కుమారుడు చిన్నయ్య, మురిమడుగుకు చెందిన సుజాత భర్త ఇందూర్, నెమలికొండ లింగవ్వ భర్త లింగవ్వ సాధరణ మరణం పొందగా, వారికి ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయం కోసం లేబర్ అధికారి కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభాకర్ తెలిపారు. కానీ ఫైల్ ఆదిలాబాద్ పంపడానికి, ప్రభుత్వ ఆర్థిక సహాయం వచ్చేందుకు లేబర్ అధికారి ఒకరికి రూ.వెయ్యి అడుగుతున్నారని వారు ఆరోపించారు. అలాగే మురిమడుగుకు చెందిన వినోద, జమునకు ప్రసూతి డబ్బుల కోసం దరఖాస్తు చేసుకుంటే కూడా డబ్బులు అడిగినట్లు వారు పేర్కొన్నారు. అయితే లేబర్ అధికారులు వచ్చినట్లు తెలుసుకున్న వారు వారి ఉన్న గది ముందు నిరసన వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వ అందించే ఆర్థిక సహాయం వచ్చేలా చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ స్పందించి, కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న లేబర్ అధికారిపై చర్యలు తీసుకుని, అర్హులైన వారికి ఆర్థిక సహాయం అందేలా చూడాలని కోరారు. డబ్బులు అడగలేదు బీమా డబ్బులు ఇవ్వడానికి, ఫైల్ ఆదిలాబాద్ పంపడానికి తానేమి డబ్బులు డిమాండ్ చేయడం లేదు. దరఖాస్తులో వివరాలు సరిగ్గా లేనందునే ఆలస్యం జరుగుతోంది. - హేమలత, లేబర్ అధికారి -
బీమా సొమ్ము రైతులకు అందడంలేదు: గవర్నర్
హైదరాబాద్ : రైతులకు బీమా డబ్బులు సక్రమంగా అందడంలేదని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన జాతీయ వినియోగదారుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ.. వినియోగదారుల అవగాహన సదస్సులు పల్లెల్లో నిర్వహిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. ప్రకటనలతో రైతులకు భరోసా కల్పించలేకపోతున్నామని గవర్నర్ అన్నారు. -
పంటల బీమా అవకతవకలపై ముగిసిన విచారణ
సిద్దిపేట రూరల్ : రైతులు పంటల బీమా కోసం చెల్లించిన డబ్బులో కొంత మొత్తాన్ని ఆదర్శ రైతులు స్వాహా చేసినట్లు తేలింది. దీంతో సిద్దిపేట మండలం తోర్నాల గ్రామంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న పంటలబీమా అవకతవకల విచారణ బుధవారం తెరపడింది. రూరల్ ఎస్ఐ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వద్ద రైతుల సమక్షంలో విచారణ జరుపగా, గ్రామంలో 232 మంది రైతులు 43 హెక్టార్లకు చెల్లించిన బీమా డబ్బులో కొంత మొత్తాన్ని ఆదర్శ రైతులు సొంతానికి వాడుకున్నట్లు తేలింది. ఆదర్శ రైతులు పంటల బీమా పేరుతో చిన్న, సన్నకారు రైతుల నుంచి వసూలు చేసిన రూ.22,490, పెద్ద రైతుల నుంచి వసూలు చేసిన రూ. 3,200 వాడుకున్నట్లు విచారణలో తేలింది. ఈ సందర్భంగా ఏఈఓ హన్మంతారెడ్డి మాట్లాడుతూ, పంటల బీమా డబ్బుల అవకతవకలపై నాలుగు రోజులుగా విచారణ చేయగా, ఆదర్శరైతుల బండారం బయట పడిందన్నారు. గ్రామంలో 373 మంది రైతులు మొక్కజొన్న పంటకు బీమా చేయించుకోగా, ఆదర్శ రైతులు చిన్న, సన్నకారు రైతుల నుంచి రూ. 237, పెద్ద రైతుల నుంచి రూ. 263 చొప్పున వసూలు చేశారు. అయితే పంటల బీమా కోసం రైతులు చెల్లించిన డబ్బులను డీడీ తీయాల్సిన ఆదర్శరైతులు అవకతవకలకు పాల్పడ్డారు. రైతుల పొలం విస్తీర్ణాన్ని తక్కువగా చూసి బీమా డబ్బు చెల్లించారని ఏఈఓ తెలిపారు. ఈ అవకతవకలన్నీ బయటపడడంతో ఆదర్శ రైతులు తమ తప్పులు ఒప్పుకుని స్వాహా చేసిన సొమ్ము తిరిగి చెల్లిస్తామని ఒప్పుకున్నట్లు ఏఈఓ పేర్కొన్నారు. అంతకుముందు గ్రామ పంచాయతీ వద్ద జరిగిన విచారణలో సందర్భంగా గ్రామానికి చెందిన శీలం బాబు అనే వ్యక్తి గ్రామ ఎంపీటీసీ యొదుల్ల నర్సింలును బహిరంగంగా దూషించారని, దీంతోఎంపీటీసీ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పరమేశ్వర్‌గౌడ్ ఉన్నారు.