మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ | Inter advanced supplementary exams start from 24th May | Sakshi
Sakshi News home page

మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ

Published Fri, Apr 22 2016 7:34 PM | Last Updated on Sun, Sep 3 2017 10:31 PM

Inter advanced supplementary exams start from 24th May

హైదరాబాద్ : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను వచ్చే నెల 24 నుంచి నిర్వహించనున్నట్టు ఇంటర్‌ బోర్డు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9 గంటలకు,  సెకండ్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలవుతాయి.

అదే విధంగా ప్రాక్టికల్స్ జూన్ 1 నుంచి 6 వరకు నిర్వహించనున్నారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూ పరీక్ష జూన్ 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్ 8వ తేదీ జరగనుంది. ఇంటర్ ఒకేషనల్ కోర్స్ విద్యార్థులకు కూడా ఇదే షెడ్యూల్ వర్తిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement