బిక్షుదయ చేపట్టిన జైనులు | jains performed bikshu daya | Sakshi
Sakshi News home page

బిక్షుదయ చేపట్టిన జైనులు

Published Sun, Sep 6 2015 7:45 PM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM

jains performed bikshu daya

హైదరాబాద్: జైన మమస్తులు ఒక రోజు పాటు తమ మత గురువు మాదిరిగా జీవితాన్ని గడిపే బిక్షుదయ కార్యక్రమాన్ని ఆదివారం కాచిగూడలోని జైన్‌భవన్‌లో చేపట్టారు. దాదాపు 1,500 మంది జైనులు ఎలాంటి సౌకర్యాలు, వసతుల జోలికి పోకుండా... గురువుల్లా వస్త్రాలను ధరించారు. ఆభరణాలను, డబ్బును త్యజించి కాచిగూడ జైన్ సంస్థాన్‌లో తమ మత గురువులు శ్రీ వినయ్ ముని ఆలియాస్ వర్గీసే, గౌతమ్ ముని, సంజ ముని, సాగర్ ముని సాన్నిధ్యంలో ప్రార్థనలు చేస్తూ, వారి ప్రవచనలను వింటూ గడిపారు.

భోజన సమయంలో పరిసర ప్రాంతాలలో జైన కుటుంబాల వద్దకు వెళ్లి భిక్షాటన చేశారు. బిక్షాటన ద్వారా తీసుకొచ్చిన భోజనాన్ని స్వీకరించారు. గురువులు ఎంత కఠోర పరిశ్రమతో తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకోవచ్చునని గ్రేటర్ హైదరాబాద్ శ్రీ వర్ధమాన్ స్థానక్ వాసీ జైన్ శ్రావక్ సంఘ్ అధ్యక్షుడు ప్రకాష్‌చంద్ లోద, కార్యదర్శి కాంతిలాల్‌జీ పిట్లీయా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement