అదిగదిగో బాహుబలి | Amazon adigadigo | Sakshi
Sakshi News home page

అదిగదిగో బాహుబలి

Published Fri, Mar 31 2017 7:54 PM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM

Amazon adigadigo

► మహామస్తకాభిషేకానికి  మొదలైన ఏర్పాట్లు
► గోమఠేశ్వరుని  విగ్రహం శుద్ధి 
సాక్షి, బెంగళూరు: జైనులు పరమపవిత్రంగా భావించే హాసన్ జిల్లా శ్రావణ బెళగోళలో కొండపై కొలువైన గోమఠేశ్వరుని ఆధ్యాత్మికోత్సవం మహామస్తకాభిషేకానికి ఏర్పాట్లు మొదలైనాయి. గురువారం విగ్రహాన్ని శాస్త్రోక్తంగా జలాలతో శుభ్రం చేశారు.
 
12 ఏళ్లకు ఒకసారి జరిగే మహా వేడుకల్లో బృహత్‌ శిలా విగ్రహానికి చందనం, కుంకుమ, పసుపు, వివిధ నదీజలాలతో నిండిన 1,008 కళశాలతో అభిషేకం చేస్తారు. 57 అడుగుల ఎత్తైన ఈ ఏకశిలా విగ్రహాన్ని క్రీస్తుశకం 981లో గంగ వంశానికి చెందిన రాజులు ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది. 2006 ఫిబ్రవరిలో 87వ మహామస్తకాభిషేకం నిర్వహించారు. 88వ మహామస్తకాభిషేకం 2018 ఫిబ్రవరి 7 నుంచి 26వ తేదీ వరకూ నిర్వహిస్తారు. దేశవిదేశాల నుంచి వచ్చే దాదాపు 30 లక్షల మంది భక్తులు బాహుబలిని సందర్శించుకుంటారని నిర్వాహకులు చెబుతున్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని సహా ఎందరో ప్రముఖులు మస్తకాభిషేకాల్లో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement