Gomathesvaruni statue
-
షాక్ : బాహుబలి కోసం 400 మెట్లెక్కి...
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక సీనియర్ నేత, మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ పెద్ద షాకే ఇచ్చారు. దాదాపు 400లకి పైగా మెట్లు ఎక్కి ఆశ్చర్యానికి గురి చేశారు. శనివారం శ్రావణ బెళగొళ లోని బాహుబలి మహామస్తకాభిషేక కార్యక్రమానికి వెళ్లిన ఆయన ఈ పని చేశారు. 86 ఏళ్ల దేవెగౌడ తన భార్య, కుటుంబ సభ్యులతో కలిసి బాహుబలి(గోమఠేశ్వర విగ్రహ) 88వ మహామస్తకాభిషేకం నిర్వహించేందుకు వింధ్యగిరి పర్వతాలకు వెళ్లారు. ఆయన భార్య చిన్నమ్మ పల్లకిలో వెళ్లగా.. ఈయన మాత్రం కాలినడకన బయలుదేరారు. ఆరోగ్య సమస్యల రిత్యా డోలిలో(పల్లకి తరహా) వెళ్లాలంటూ బంధువులు ఆయనకు సూచించారు. అయితే ఆయన మాత్రం ససేమిరా అంటూ మెట్లు ఎక్కేశారు. ఇద్దరు భద్రతా సిబ్బంది సాయంతో 50 నిమిషాల్లో మెట్లు ఎక్కేశారు. కొందరు అనుచరులు ఆయన్ని వెంబడిస్తూ బాహుబలి నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగించారు. అయితే అన్ని మెట్లు ఒకేసారి ఎక్కేసరికి ఆయన కాస్త అలసటకు లోనయ్యారు. దీంతో కొండ పైన ఉన్న ఆరోగ్య కేంద్రంలో కాసేపు విశ్రాంతి తీసుకుని, ఆపై మహామస్తకాభిషేకంలో పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో కూడా ఆయన కాలి నడకనే దిగటం విశేషం. గత వారం సిద్ధరామయ్య కూడా డోలిని తిరస్కరించి మెట్లెక్కి కార్యక్రమంలో పాల్గొన్నారు. -
బాహుబలి అభిషేక వేడుకలు
-
ఆధ్యాత్మికతకు భారత్ రాజధాని
మైసూరు (శ్రావణ బెళగొళ): ప్రాచీన సంప్రదాయాలతో భారతదేశం విరాజిల్లుతోందనీ, ప్రపంచంలో ఆధ్యాత్మికతకు భారత్ రాజధాని అని ఉపరాష్ట్రపతి వెంకయ్య వ్యాఖ్యానించారు. శ్రావణ బెళగొళలో గోమఠేశ్వరుని మహామస్తకాభిషేకాల్లో శనివారం ఆయన పాల్గొన్నారు. చావుండరాయ వేదికపై కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆధ్యాత్మికంగా, ధార్మికంగా ఘనచరిత్ర కలిగిన కర్ణాటకలో జరుగుతున్న బాహుబలి మహామస్తకాభిషేకాల్లో పాల్గొనడం తనకు జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకమన్నారు. మన ఆచార, వ్యవహారాలను చూసి ఎవ్వరూ సిగ్గుపడనక్కర లేదన్నారు. మన పూర్వీకులు, గురువుల నుంచి నేర్చుకున్న సంస్కృతీ సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందజేయాలన్నారు. -
శాంతిస్థాపకుడు బాహుబలి
సాక్షి, బెంగళూరు: శాంతి స్థాపనకు బాహుబలి (గోమఠేశ్వరుడు) ఎంతో కృషి చేశారని రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ పేర్కొన్నారు. అన్నింటి కంటే శాంతి ముఖ్యమని బోధించే జైనధర్మం ప్రపంచంలోనే ఎంతో విలువైందని కొనియాడారు. కర్ణాటకలో హాసన్ జిల్లా శ్రావణ బెళగొళలో కొలువుతీరిన గోమఠేశ్వరుని విగ్రహానికి 88వ మహామస్తకాభిషేక కార్యక్రమాలను కోవింద్ బుధవారం ప్రారంభించారు. పన్నెండేళ్లకోసారి జరిగే ఈ ఉత్సవాలను చావుండరాయ సభ మంటపంలో జ్యోతిని వెలిగించి నాంది పలికారు. ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగే ఈ ఉత్సవాల్లో భాగంగా 17వ తేదీన మహామస్తకాభిషేకం జరుగనుంది. వేడుకల్లో రాష్ట్రపతి సతీమణి సవితా కోవింద్, గవర్నర్ వజుభాయి వాలా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ తదితరులు పాల్గొన్నారు. 17 మీటర్ల ఎత్తైన బాహుబలి ఏకశిలా విగ్రహానికి జైన అర్చకులు పాలు, నెయ్యి, కుంకుమలతో అభిషేకం చేశారు. -
అదిగదిగో బాహుబలి
► మహామస్తకాభిషేకానికి మొదలైన ఏర్పాట్లు ► గోమఠేశ్వరుని విగ్రహం శుద్ధి సాక్షి, బెంగళూరు: జైనులు పరమపవిత్రంగా భావించే హాసన్ జిల్లా శ్రావణ బెళగోళలో కొండపై కొలువైన గోమఠేశ్వరుని ఆధ్యాత్మికోత్సవం మహామస్తకాభిషేకానికి ఏర్పాట్లు మొదలైనాయి. గురువారం విగ్రహాన్ని శాస్త్రోక్తంగా జలాలతో శుభ్రం చేశారు. 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహా వేడుకల్లో బృహత్ శిలా విగ్రహానికి చందనం, కుంకుమ, పసుపు, వివిధ నదీజలాలతో నిండిన 1,008 కళశాలతో అభిషేకం చేస్తారు. 57 అడుగుల ఎత్తైన ఈ ఏకశిలా విగ్రహాన్ని క్రీస్తుశకం 981లో గంగ వంశానికి చెందిన రాజులు ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది. 2006 ఫిబ్రవరిలో 87వ మహామస్తకాభిషేకం నిర్వహించారు. 88వ మహామస్తకాభిషేకం 2018 ఫిబ్రవరి 7 నుంచి 26వ తేదీ వరకూ నిర్వహిస్తారు. దేశవిదేశాల నుంచి వచ్చే దాదాపు 30 లక్షల మంది భక్తులు బాహుబలిని సందర్శించుకుంటారని నిర్వాహకులు చెబుతున్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని సహా ఎందరో ప్రముఖులు మస్తకాభిషేకాల్లో పాల్గొనున్నట్లు తెలుస్తోంది.