12న తెలంగాణ కాంగ్రెస్ మ్యానిఫెస్టో : పొన్నాల | Jairam Ramesh to release Congress manifesto for Telangana | Sakshi
Sakshi News home page

12న తెలంగాణ కాంగ్రెస్ మ్యానిఫెస్టో : పొన్నాల

Published Thu, Apr 10 2014 7:44 PM | Last Updated on Mon, Mar 18 2019 8:56 PM

12న తెలంగాణ కాంగ్రెస్ మ్యానిఫెస్టో : పొన్నాల - Sakshi

12న తెలంగాణ కాంగ్రెస్ మ్యానిఫెస్టో : పొన్నాల

హైదరాబాద్: తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్రమంత్రి జైరామ్ రమేష్  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మ్యానిఫెస్టోను ఏప్రిల్ 12 తేదిన విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 12 తేదిన ఉదయం 11 గంటలకు గాంధీభవన్ లో మ్యానిఫెస్టోను జైరామ్ విడుదల చేస్తారని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు రూపొందించడంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్ లో జైరామ్ రమేష్ కీలక సభ్యుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 
 
తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ప్రచారానికి జైరామ్ స్వీకారం చుట్టారు. మ్యానిఫెస్టో ను తయారు చేయడానికి మాజీ మంత్రి శ్రీధర్ బాబు, డిప్యూటి స్పీకర్ మల్లు భట్టివిక్రమార్కలను నియమించారు. తాము రూపొందించే మ్యానిఫెస్టోలో తప్పుడు హామీలు చేయమని పొన్నాల వ్యాఖ్యలు చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement