‘డబుల్’పై చిత్తశుద్ధి లేదు
కేసీఆర్‌పై జీవన్‌రెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన టీఆర్‌ఎస్... అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా పథకాన్ని కనీసం ప్రారంభించలేదని సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. అసెం బ్లీ ఆవరణలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ... నిరుపేద వర్గాలకు ఇళ్లు కట్టించే పథకంపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. ప్రభుత్వం ఇస్తామం టున్న మొత్తంతో ఇళ్ల నిర్మాణం సాధ్యం కాదని కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదన్నారు.
ఇది తెలిసికూడా కేసీఆర్ నిర్లక్ష్యం చేయడం వెనుక పేదలకు ఇళ్లు ఇవ్వాలనే ఆలోచన లేకపోవడమే కారణమన్నారు. ఈ ఇళ్ల నిర్మాణాన్ని లబ్ధిదారులకే అప్పగించాలన్నారు. కేసీఆర్ కేవలం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలకే సీఎంలా వ్యవహరిస్తున్నారన్నారు. కొత్త సచివాలయం, క్యాంపు కార్యాలయం అంటూ వందల కోట్లు వృథా చేస్తున్నారని, ఇది సరైంది కాదని జీవన్‌రెడ్డి హితవు పలికారు.