పోరాడినా ప్రయోజనం లేదెందుకు! | Congress party future Plans | Sakshi
Sakshi News home page

పోరాడినా ప్రయోజనం లేదెందుకు!

Published Mon, Jan 9 2017 3:40 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

పోరాడినా ప్రయోజనం లేదెందుకు! - Sakshi

పోరాడినా ప్రయోజనం లేదెందుకు!

రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై పీసీసీలో తర్జనభర్జన
ఇకపై ఐక్యంగా పని చేయాలని నిర్ణయం
31 జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పోరాటానికి ప్రణాళికలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ పరిస్థితిపై పీసీసీ సీనియర్లు, ముఖ్యనేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై ఎంత పోరా డినా కాంగ్రెస్‌పార్టీకి అనుకున్నంత ప్రయో జనం దక్కడం లేదని వారు కలత చెందు తున్నారు. ఇటు అసెంబ్లీలో అటు బయటా టీఆర్‌ఎస్‌ సర్కారు తప్పిదాలను ఎప్పటికప్పు డు ఎండగడుతున్నా, కాంగ్రెస్‌పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం ఎందుకు పెరగడం లేదని సీనియర్లు తలలు పట్టుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ రెండున్నరేళ్ల పాలన తర్వాత ఆ పార్టీకోసం పనిచేసిన వర్గాల్లోనే కాకుండా, పార్టీ నాయకుల్లోనూ ఎక్కడో తెలియని అసంతృప్తి ఉన్నట్టుగా సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేసుకుంటూనే, ఆ అసంతృప్తిని కాంగ్రెస్‌పార్టీకి అనుకూలంగా ఎందుకు మలచుకోలేకపోతున్నామని ఆ పార్టీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు.

రైతులకు రుణమాఫీ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ వంటి పథకాల విషయంలో ప్రజలు అసం తృప్తిగా ఉన్నట్టు కాంగ్రెస్‌పార్టీకి క్షేత్రస్థాయి నుంచి నివేదికలు అందుతు న్నాయి. రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపించగలిగే ఎస్టీలకు, మైనారిటీలకు రిజర్వేషన్లు, కుల సంఘాలకు పలుమార్లు ఇచ్చిన హామీలు, ఉద్యోగ సంఘాలకు చేసిన వాగ్దానాల అమలులో వైఫల్యంతో పాటు విద్యార్థులు, యువకులు తీవ్ర అసహనంగా ఉన్నట్టు సమాచారం అందుతోంది. విద్యా ర్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు, కేజీ టు పీజీదాకా ఉచితనిర్బంధ విద్య, ఉద్యోగాల భర్తీ వంటి కీలకమైన అంశాల్లోనూ టీఆర్‌ఎస్‌ వైఫల్యం కంటికి కనిపించేవిధంగానే ఉన్నదని కాంగ్రెస్‌ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

వీటితోపాటు తెలంగాణ ఉద్యమంలో, టీఆర్‌ఎస్‌ గెలుపులోనూ కీలకంగా పనిచేసిన తెలంగాణ వాదులు, టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు, ఉద్యోగ సంఘాలు కూడా పలు అంశాలపై అసహనం గా ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. సమైక్యరాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన వారు, అప్పుడు వివిధ స్థాయిల్లో కీలకంగా పనిచేసినవారే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనూ భాగస్వాములుగా ఉన్నారని, తెలంగాణ కోసం పనిచేసినవారు నిర్లక్ష్యానికి గురవుతు న్నారని అధికార పార్టీ నేతలు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు. వీటితో సోనియా గాంధీ ధృడంగా లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని అన్నివర్గాలు అంగీకరిస్తున్నప్పటికీ, టీఆర్‌ఎస్‌ వైఫల్యాలు ఎన్నో ఉన్నప్పటికీ ప్రజలకు ఎందుకు చేరువకాలేకపోతున్నామని కాంగ్రెస్‌ ముఖ్యులు చర్చించుకుంటున్నారు.

ఏకతాటిపైకి రావాల్సిందే...
టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలంటే రాష్ట్రంలోని పార్టీ ముఖ్యు లంతా ఏకతాటిపైకి వచ్చి, ఐక్యంగా ఉన్నామనే బలమైన సంకేతాలను పంపిం చాల్సిందేనని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. దీనికోసం ఎలాంటి కార్యాచరణ అనుసరిం చాలన్న అంశంపై పీసీసీ ముఖ్యనేతలు చర్చిం చుకుంటున్నారు. టీపీసీసీ ముఖ్య బాధ్యతల్లో ఉన్నవారు, కేంద్రస్థాయిలో పార్టీ నిర్ణయాలను ప్రభావితం చేయగలిగేవారు, అధిష్టానానికి దగ్గరగా ఉన్నవారు, ప్రజల్లో ఆదరణ కలిగి నవారు అంతా ఒకవేదికపైకి రావాలని నేతలు నిర్ణయించుకున్నారు. దీనికోసం ప్రాథమిక స్థాయిలో కొంత కసరత్తు జరిగినట్టుగా టీపీసీసీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు.

అసెంబ్లీ సమావేశాల తర్వాత భేటీ..
అసెంబ్లీ సమావేశాల తర్వాత పార్టీ ముఖ్యులను సమావేశపర్చాలనే యోచ నలో ఉన్నట్టు ఆ నాయకుడు వెల్లడించా రు. వచ్చే వేసవికాలం నాటికి పటిష్టమైన వ్యూహంతో 31 జిల్లాలను కేంద్రాలుగా చేసుకుని, క్షేత్రస్థాయిలో పనిచేయాలని భావిస్తున్నట్టుగా వెల్లడించారు. ముందు గా పార్టీ నేతలను ఏకతాటిపైకి తీసుకు రావడం, ఆ తరువాత టీఆర్‌ఎస్‌ వైఫ ల్యాలపై క్షేత్రస్థాయిలో గట్టిగా పోరా డడం మినహా మరో మార్గం లేదన్న అంచనాకు వచ్చినట్టుగా ఆ నాయకుడు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement