
జస్టిస్ ఎన్‌వీ రమణ కుమార్తె వివాహానికి ప్రముఖుల హాజరు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, శివమాల దంపతుల కుమార్తె డాక్టర్ భువన వివాహం కృష్ణభారతి, నాయుడమ్మల కుమారుడు రితేశ్‌తో బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని హోటల్ నోవాటెల్‌లో జరిగింది.
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, శివమాల దంపతుల కుమార్తె డాక్టర్ భువన వివాహం కృష్ణభారతి, నాయుడమ్మల కుమారుడు రితేశ్‌తో బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని హోటల్ నోవాటెల్‌లో జరిగింది. వివిధ రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, కేరళ గవర్నర్ జస్టిస్ సదాశివం, తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య, తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి, ఇంకా పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి, పలువురు రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి, సినీ నటుడు బాలకృష్ణ దంపతులు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.