ఇసుక మాఫియా చేతిలో చంద్రబాబు బందీ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఇసుకు మాఫియా చేతిలో బందీ అయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లో రామకృష్ణ విలేకర్లతో మాట్లాడుతూ... ఇసుక మాఫియా ప్రతినిధిగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కృష్ణాజిల్లా ముసునూరు తహసీల్దార్ డి.వనజాక్షిపై దాడి చేసిన పార్టీ ఎమ్మెల్యే చింతమననే ప్రభాకర్ను విప్ పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో డీఎస్పీ హరినాథ్రెడ్డితో గొడవ జరిగితే వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని గుర్తు చేశారు. భూమా నాగిరెడ్డికి ఓ న్యాయం... చింతమనేనికి మరో న్యాయమా ? అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నిలదీశారు.