
కేకరీనా.. from america
చిట్‌చాట్
మనసుకు నచ్చిన మ్యూజిక్.. ఇప్పుడు జీవనోపాధిగా మారింది. ఆ ఒంటరి ప్రయాణం ఎల్లలు దాటింది. దేశాలు చుట్టొచ్చి.. హైదరాబాద్‌లో టాక్ ఆఫ్ ది డీజేగా మారింది. హోరెత్తించే మ్యూజిక్‌ను.. వేళ్ల మీద ఆడిస్తూ.. కుర్రకారుకు జోష్‌నిస్తోంది డీజే సియానా కేథరినా రోడ్రిగ్జ్. తాజ్‌బంజారాలో
ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా శనివారం నిర్వహించిన ‘టమాటినో బాష్’లో ఈ కాలిఫోర్నియా బేబీ
ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా డీజే సియానాతో ‘సిటీప్లస్’ ముచ్చటించింది. - వాంకె శ్రీనివాస్
నా పేరెంట్స్ లాటిన్ అమెరికన్, ఆంగ్లో ఇండియన్‌కు చెందిన వారు. వాళ్లకు నేను, తమ్ముడు. చిన్నప్పటి నుంచే డ్యాన్స్, మ్యూజిక్ అంటే ఇష్టం. పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లినప్పుడు అక్కడ డీజే మ్యూజిక్ వినేదాన్ని. క్రమంగా దానిపై ఇంట్రెస్ట్ పెరిగింది. ఓ రోడ్డు ప్రమాదంలో మా కుటుంబం నాకు శాశ్వతంగా దూరమైంది. అప్పుడు నాకు 15 ఏళ్లు. ఓ ఏడాది అనాథాశ్రమంలో ఉన్నాను. నాకప్పటికే మోడలింగ్‌లో ప్రవేశం ఉంది. జీవనోపాధి కోసం డీజే వృత్తిలోకి రావాలనుకున్నా. మూడు నెలల శిక్షణ తర్వాత కొన్ని పార్టీల్లో డీజే ప్లే చేశాను.
ఇక్కడైతే సెలబ్రిటీ హోదా
తొలినాళ్లలో ప్రోగ్రామ్స్‌కు పిలిచి డబ్బు ఎగ్గొట్టేవారు. మెల్లిగా ఈ ప్రొఫెషన్‌లో కుదురుకున్నాను. ఇప్పటి వరకు ఇండియాతో పాటు అమెరికా, ఇంగ్లండ్‌లలో డీజే షోలు ఇచ్చా. అక్కడ డీజేలను పట్టించుకోరు. అదే ఇండియాలో అయితే డీజే ప్లేకు మంచి రెస్పాన్స్ ఉంటుంది. డీజే ప్లేయర్‌ను సెలబ్రిటీగా చూస్తారు. ప్రోగ్రామ్ తర్వాత.. అభిమానంతో నాతో ఫొటోలు కూడా దిగుతారు.
హైదరాబాద్‌లో పది షోలు
ఇండియాలో రెండేళ్లలో 16కు పైగా డీజే షోలిస్తే.. వీటిలో 10 హైదరాబాద్‌లో చేసినవే. సిటీలో ఎక్కడ షో జరిగినా వందలాది మంది వస్తుంటారు. హైదరాబాదీలంటే అమితమైనఅభిమానం. ఇక్కడి ఫుడ్ చాలా రుచిగా ఉంటుంది. ఫేమస్ హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ మరచిపోలేను.తపనుండాలి అమెరికా, ఇంగ్లండ్‌లలో పదికి పైగా డీజే షోలు చేశాను. ప్రపంచంలోనే ఉత్తమ డీజే టియోస్టోనే నాకు స్ఫూర్తి. ప్రపంచవ్యాప్తంగా డీజేకు ఆదరణ పెరుగుతోంది. ఈ వృత్తిలోకి ప్రవేశించాలంటే ఇంట్రెస్ట్‌తో పాటు ఏదైనా సాధించాలన్న తపన ఉండాలి. అయితే ఈ ప్రొఫెషన్ గురించి రాంగ్ మెసేజ్ ఇచ్చేవాళ్లు ఎక్కువగా ఉంటారు. ఇవి కెరీర్‌కు అడ్డుకాకూడదు. డీజే నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్న యువతకు నేను ఉచితంగా ట్రైనింగ్ ఇస్తుంటాను.