ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్లతో సమానంగా ప్రాధాన్యం ఇవ్వాలంటూ ప్రైవేట్ లెక్చరర్లు ఆదిలాబాద్‌లో ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్‌ను బహిష్కరించారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్లతో సమానంగా ప్రాధాన్యం ఇవ్వాలంటూ ప్రైవేట్ లెక్చరర్లు ఆదిలాబాద్‌లో ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్‌ను బహిష్కరించారు. శుక్రవారం మధ్యాహ్నం లెక్చరర్ల సంఘం ఆధ్వర్యంలో స్పాట్ కేంద్రం వద్ద నిరసన తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు పెండింగ్ స్కాలర్‌షిప్పులను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆందోళనలో సంఘం జిల్లా నేతలు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.