కమిషనర్ ఆఫీస్ లో ఉద్యోగి ఆత్మహత్యాయత్నం | man suicide attempt at Agricultural Commissioner's Office | Sakshi
Sakshi News home page

కమిషనర్ ఆఫీస్ లో ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

Published Fri, Jun 3 2016 6:22 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

man suicide attempt at Agricultural Commissioner's Office

హైదరాబాద్‌: అబిడ్స్‌లోని వ్యవసాయ కమిషనరు కార్యాలయం ముందు తెలంగాణ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడుతుండగా తోటి ఉద్యోగులు వెంటనే స్పందించి అడ్డుకున్నారు. హైదరాబాద్‌లోని పరిశ్రమల శాఖలో నాలుగవ తరగతి ఉద్యోగిగా మహ్మద్ బదిరుద్దీన్ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉద్యోగుల విభజన నేపథ్యంలో కొందరు తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రాకు పంపిస్తున్నారు. దీని నిరసిస్తూ ఉద్యోగులు వ్యవసాయక మిషనరు కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఉద్యోగుల్లో ఒకడైన బదిరుద్దీన్ అకస్మాత్తుగా పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అనంతరం ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement