బంజారాహిల్స్ : పని చేస్తున్న సంస్థకు కన్నం వేసి పోలీసులకు చిక్కాడు ఓ ప్రబుద్ధుడు. జూబ్లీహిల్స్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ముత్తు తెలిపిన వివరాల ప్రకారం.. బాలానగర్ నేతాజినగర్ కాలనీలో ఉన్న ఫతేనగర్ చర్చి స్ట్రీట్‌లో నివసించే వాయిల వెంకటేశ్వర్లు అలియాస్ విక్కి(23) సేల్స్ ఎగ్జిక్యూటీవ్‌గా పని చేస్తున్నాడు. ఆయన పని చేస్తున్న కంపెనీలో ప్రతిరోజూ డబ్బు లావాదేవీలు జరుగుతుంటాయి. గత నెల 18వ తేదీన ఎవరూ లేని సమయంలో క్యాష్ కౌంటర్‌లో నుంచి రూ. 2.50 లక్షలు దొంగిలించి పరారయ్యాడు.
సంస్థ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా సీసీ ఫుటేజీ ఆధారంగా ఈ డబ్బు దొంగిలించినట్లు తేలింది. ఆయన్ను అరెస్టు చేసి రూ. 1.91 లక్షల నగదుతో పాటు ఒక ట్యాబ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పని చేస్తున్న సంస్థకే కన్నం
Published Sun, Jun 5 2016 5:29 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM
Advertisement
Advertisement