- సమస్యలు పరిష్కరించాలని మంత్రి లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేత
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖలోని వివిధ ఉద్యోగ సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)గా ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని జేఏసీ ఛైర్మన్ బి.వెంకటేశ్వర్‌రెడ్డి, కన్వీనర్ ఎన్.నారాయణరెడ్డి, ముఖ్య సలహాదారు జూపల్లి రాజేందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జేఏసీ ఏర్పడిన విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకొచ్చామని.. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశామని ముఖ్య సలహాదారు జూపల్లి రాజేందర్ తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య ఉద్యోగులకు సంబంధించి ఏ సమస్య వచ్చినా ఈ జేఏసీతోనే సంప్రదించాలని మంత్రిని కోరారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ట్రెజరీల ద్వారా వేతనాలు అందజేయాలని కోరారు.
వైద్య ఆరోగ్య ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు
Published Wed, Aug 26 2015 9:36 PM | Last Updated on Sun, Sep 3 2017 8:10 AM
Advertisement
Advertisement