Joint Action Committee
-
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ర్యాలీ భగ్నం
సుందరయ్య విజ్ఞానకేంద్రం: సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు మంగళవారం తలపెట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తతత నెలకొంది. ఎస్వీకే వద్దకు చేరుకున్న వందలాది మంది కార్మికులతో సభ జరిగింది. అనంతరం కార్మికులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు ర్యాలీగా బయలుదేరగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు ర్యాలీని భగ్నం చేయటంతోపాటు పలువురిని అరెస్టు చేసి మలక్‌పేట, అఫ్జల్‌గంజ్ పోలీస్స్టేషన్లకు తరలించారు. అంతకు ముందు జరిగిన సభలో సీపీఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సింగరేణి లాభాలకు కార్మికులే కారణమని, అలాంటి కార్మికుల శ్రమ దోపిడీ చేయటం దుర్మార్గమని అన్నారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఎస్.వీరయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవైపు సింగరేణి కార్మికులను పొగుడుతూనే, వారి సంక్షేమం విషయంలో మాత్రం ముఖం చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ కార్యదర్శి ఎస్.వెంకటేశ్వర్రావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఇఫ్టూ ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, ఎస్.ఎల్.పద్మ, జి.అనురాధ, ఐఎన్టీయూసీ నాయకులు నాగభూషణం, బీఎంఎస్ నాయకులు నాగేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు. -
బిల్లు తెస్తే.. సమ్మె తప్పదు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సవరణ బిల్లు 2021ను పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని చూస్తే.. ఆ మరుక్షణం నుంచే దేశవ్యాప్త సమ్మెకు వెనుకాడబోమని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యచరణ కమిటీ హెచ్చరించింది. జాతీయ విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల సమన్వయ కమిటీ పిలుపు మేరకు బుధవారం మింట్ కాంపౌండ్‌లోని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయం ముందు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల జాయింట్ యాక్షన్ కమిటీ(టీఎస్పీఈజేఏసీ) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అలాగే తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీఈ ఈజేఏసీ) ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని విద్యుత్‌సౌధ ఆవరణలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా టీఎస్పీఈజేఏసీ ప్రతినిధులు రత్నాకర్‌రావు, సదానందం, టీఈఈజేఏసీ కన్వీనర్ ఎన్.శివాజీ, కో చైర్మన్ పి.అంజయ్య మాట్లాడుతూ... రైతులు, పేదలకు నష్టదాయకంగా ఉన్న ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలా కాదని బిల్లు తీసుకొస్తే.. ఆ తర్వాత జరుగబోయే పరిణామాలకు కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం సహా ఉద్యోగులు ఏళ్ల తరబడి ఎంతో కష్టపడి ఏర్పాటు చేసుకున్న విద్యుత్ లైన్లు, ఉపకేంద్రాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం అన్యాయమన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో ప్రధానమైన బొగ్గు, ఇంధనం, రవాణా తదితర రంగాలను తన గుప్పిట్లో పెట్టుకున్న కేంద్రం.. నష్టాల పేరుతో డిస్ట్రిబ్యూషన్ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థల ప్రయోజనం కోసమే డిస్కంల ప్రైవేటీకరణ అంశాన్ని ముందుకు తెచ్చిం దని వివరించారు. -
రాజ్యాంగ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఓబీసీలకు రాజ్యాంగ పదవుల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ జాతీయ సంయుక్త కార్యాచరణ కమిటీ తీర్మానించింది. జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, జస్టిస్ ఈశ్వరయ్య అధ్యక్షతన సోమవారం ఢిల్లీలో జరిగిన సదస్సులో 12 రాష్ట్రాల బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ..సుప్రీంకోర్టు, హైకోర్టు, చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ రంగాల్లో రాజ్యాంగ పరంగా ఓబీసీలకు దక్కాల్సిన 27% రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల హైకోర్టు నాయమూర్తుల నియామకంలో బీసీలు జడ్జీలుగా పనికిరారంటూ కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు తప్పుడు నివే దికలు పంపారని గుర్తు చేశారు. సుప్రీం న్యాయ మూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కూడా అదే రీతిలో స్పందించడం సరికాదన్నారు. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఉన్నా ప్రస్తుతం దేశంలో 14 శాతం కూడా అమలు కావడం లేదని చెప్పారు. కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు జడ్జీలుగా బీసీలు పనికిరారంటూ ఇచ్చిన తప్పుడు నివేదికలపై బీసీలకు క్షమాపణలు చెప్పాలని సీఎం చంద్రబాబును తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనసభలో 69 మంది బీసీలు ఉండాల్సి ఉన్నా కేవలం 19 మందే ఉన్నారని, ఏపీలో 80 మంది బీసీలు ఉండాల్సి ఉన్నా 34 మందే ఉన్నారని తెలిపారు. సదస్సులో మహారాష్ట్ర మంత్రి మహదేవ్ జన్కెర్, ఏపీ నుంచి ఓబీసీ నేత జి.వెంకటేశ్వర్లు, ఉమ్మడి హైకోర్టు న్యాయవాది మెట్టా చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
హోదా సాధనకు జేఏసీ ఏర్పాటు: పవన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని ప్రజా సంఘాలతో కలిసి జేఏసీ ఏర్పాటు చేసి పోరాటం చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ప్రకటించారు. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమం చేసిన తరహాలోనే ఏపీలో కూడా ప్రత్యేక హోదా జేఏసీ ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని సంఘాలను కలిసి మద్దతు కోరతామన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కూడా కలిసి వస్తే మంచిదని, వారిని కూడగట్టి పోరాటం చేస్తామన్నారు. ఉండవల్లి అరుణ్‌కుమార్, జేపీలతోపాటు ఇతర మేధావులను త్వరలో కలుస్తానని చెప్పారు. కాకినాడ, తిరుపతి సభల సందర్భంగా ప్రత్యేక ప్యాకేజీ వస్తుందని చెప్పామని, అయితే ఆ విషయంలో చంద్రబాబు వైఖరి అయోమయంగా ఉందని వ్యాఖ్యానించారు. వచ్చేదెంతో... ఖర్చెంతో?: కేంద్రం ఎన్ని నిధులు ఇస్తోందో సృష్టత లేకుండా పోయిందని, వాటిని ఏ రకంగా ఖర్చు చేస్తోందో రాష్ట ప్రభుత్వం కూడా చెప్పలేకపోతోందని పవన్ పేర్కొన్నారు. పారదర్శకత లేకుండా పోయిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో జేఏసీ ఏర్పాటు తప్పనిసరి అయిందని ప్రకటించారు. దీని ద్వారానే పోరాటం చేస్తామని వెల్లడించారు. -
బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది
-
కానిస్టేబుల్ రాతపరీక్షకు సహకరిస్తాం
ప్రైవేట్ విద్యాసంస్థల జేఏసీ సాక్షి, హైదరాబాద్: ఈ నెల 24న జరగనున్న పోలీస్ కానిస్టేబుళ్ల రాత పరీక్షకు సహకరిస్తామని తెలంగాణ ప్రైవేటు పాఠశాలల, కళాశాలల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) స్పష్టం చేసింది. సచివాలయంలో గురువారం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో జేఏసీ నేతలు సమావేశమై కానిస్టేబుల్ రాత పరీక్షకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్తూ.. కాలేజీలపై పోలీసుల తనిఖీలు ఆపాలని కోరారు. దీనిపై మంత్రి నాయిని స్పందిస్తూ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. పోలీస్ కానిస్టేబుళ్ల రాతపరీక్షకు సహకరిస్తామన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జాక్ కన్వీనర్ జి.రమణారెడ్డి, తెలంగాణ డిగ్రీ కాలేజీల కార్యదర్శి విజయభాస్కర్‌రెడ్డి, ట్రస్మా అధ్యక్షుడు ఎస్.ఎన్.రెడ్డి, జాక్ కో-కన్వీనర్ కె.సిద్దేశ్వర్ పాల్గొన్నారు. -
మా పొట్ట మీద కొట్టకండి
సర్కారు వైఖరిపై ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ ఆవేదన ఆత్మగౌరవం దెబ్బతినేలా పోలీసులతో తనిఖీలా? తనిఖీలు ఆపకుంటే కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి హైదరాబాద్: ప్రైవేటు విద్యాసంస్థలపై పోలీసులతో తనిఖీలు చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించడం పట్ల తెలంగాణ ప్రైవేటు విద్యాసంస్థల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) తీవ్రంగా మండిపడింది. రాష్ట్రంలో 85 శాతం విద్యావ్యాప్తికి దోహదపడుతున్న ప్రైవేటు విద్యాసంస్థలపై ఏకపక్షంగా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొంది. కనీసం తమను చర్చలకు పిలవకుండా, సంప్రదించకుండా తనిఖీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమేంటని ప్రశ్నించింది. తనిఖీల పేరుతో తమ పొట్టల మీద కొట్టొద్దని అభ్యర్థించింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో తనిఖీలు చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల యాజమాన్యాలు తెలంగాణ ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీగా ఆవిర్భవించాయి. జేఏసీ కన్వీనర్ గింజల రమణారెడ్డి, ప్రతినిధులు శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. విద్యాసంస్థల్లో పోలీస్, ఇంటెలిజెన్స్, ఏసీబీ, విజిలెన్స్ తదితర శాఖాధికారులతో ప్రభుత్వం తనిఖీలు నిర్వహిస్తామన డం అన్యాయమన్నారు. అది రాష్ట్రానికే అవమానకరం తెలంగాణలోని విద్యాసంస్థలు బోగస్ అని ప్రకటించడం రాష్ట్రానికే అవమానకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని ధ్వజమెత్తారు. తనిఖీలకు తాము వ్యతిరేకం కాదని, అయితే సంబంధిత విద్యాశాఖ అధికారులతోనే తనిఖీలు చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన విద్యాసంస్థల యాజమాన్యాలనే దోపిడీదారులుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన చెందారు. లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటున్న కార్పొరేట్ విద్యాసంస్థల జోలికి ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. ఆదివారంలోగా తనిఖీల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే.. తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ నెలాఖరులోగా రూ. 3,500 ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్లు భాస్కర్ రెడ్డి, కె. సిద్ధేశ్వర్, కో ఆర్డినేటర్ ఎస్ఎన్ రెడ్డి, అధికార ప్రతినిధి గౌరీ సతీశ్, రాంచందర్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాక్సైట్ జోలికొస్తే ఖబడ్దార్
గిరిజన సంఘం, బాక్సైట్ వ్యతిరేక ఐక్యకార్యాచరణ కమిటీ హెచ్చరిక కలెక్టరేట్ వద్ద ధర్నా మహారాణిపేట (విశాఖ): గిరిజనుల గొంతు కోసే బాక్సై ట్ జోలికొస్తే అంతుచూస్తామని గిరి జన సంఘం, బాక్సైట్ వ్యతిరేక ఐక్య కార్యాచరణ కమిటీ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. చింతపల్లి ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల కోసం జారీ చేసిన జీవో నెంబర్ 97ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి గిరిజనుల జీవనాన్ని ఫణంగా పెడుతూ బాక్సైట్ తవ్వకాలు చేపడతామంటూ మొండికేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుకు నిరసనగా సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. వీరికి పాడేరు, అరకు, పాలకొండ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వర్రావు, విశ్వరాయి కళావతి, ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.శర్మ, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మాట్లాడుతూ అధికారంలోకి రాక ముందు చంద్రబాబు 2012లో కేంద్రానికి, గవర్నర్‌కు రాసిన లేఖలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. ఇప్పుడు బాక్సైట్ తవ్వకాలు చేపడతామని ఇటీవల జారీ చేసిన జీవోను చూస్తే ఆయన ఊసరవిల్లి తనాన్ని చూసి ఎవరికైనా మతిపోతుందన్నారు. జీవో 97 గవర్నర్ ఆమోదం పొంది వస్తే ఆ జీవో గిరిజన సంక్షేమ శాఖా మంత్రికి తెలియకుండా వచ్చిందని సాక్షాత్తు సీఎం చెప్పడం ఆయన నక్కలమారి జిత్తు వేషాలకు నిదర్శనమన్నారు. గిరిజన చట్టాలపై మంత్రి అయ్యన్న మతీసుతీ లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏపీలో 1/70 చట్టం ప్రకారం గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో మైనింగ్ తవ్వితే లేని అభ్యంతరం ఇక్కడెందుకు వస్తుందో చెప్పాలనడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులంతా నిద్రాహారాలు మాని ఉద్యమాలు, పోరాటాలు చేస్తుంటే బాక్సైట్ తవ్వొద్దని గిరిజనులెవరూ చెప్పడం లేదని, కొంతమంది నాయకులే వారిని రెచ్చగొడుతున్నారని అధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గిరిజనులంటే మీకు అంతచులకనగా ఉందా? మీకు దమ్ము ధైర్యముంటే ఏజెన్సీ ప్రాంతానికి రండి.. మిమ్మల్ని గిరిజనులు తరిమి కొట్టకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేవారు. గిరిజనుల సంపదను దోచుకోవాలనే ముందు చూపుతోనే చంద్రబాబు రెండేళ్లవుతున్నా ఇంత వరకు ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు మాట్లాడుతూ గిరిజనుల గురించి, గిరిజన చట్టాల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏం తెలుసు? బాక్సైట్ తవ్వకాలు చేపట్టొద్దని సుప్రీంకోర్టు చెప్పింది, సాక్షాత్తు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో నియమించిన కేంద్రమంత్రి వర్గ సమావేశం బాక్సైట్ తవ్వకాలు చేపట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఇంకా అనేక సంస్థలు కోర్టుకెల్లి 1/70 చట్టం, పీసా, పర్యావరణ చట్టం, అటవీ హక్కుల చట్టం వంటి చట్టాలకు అనుకూలంగా తీర్పులు తెస్తే వాటన్నింటినీ తుంగలో తొక్కి బాక్సైట్ తవ్వకాలు చేపట్టడానికి గిరిజనులు అమాయకులు కాదన్నారు. ఇప్పటికే ఏజెన్సీలో అభ్యర్థులను డిపాజిట్ల్లు రాకుండా ఓడించారని.. ఇంకా నువ్వు ముందుకెల్తే గిరిజనులు చూస్తూ ఊరుకోబోరని బాబును హెచ్చరించారు. ఈ ధర్నాకు ఆంధ్రప్రదేశ్ గిరిజన ఉద్యోగుల సంఘం, ఏపీ గిరిజన ఐక్యసంఘం, ఆదివాసీ రిజర్వేషన్ సంరక్షణ సంఘం, గిరిజన విద్యార్థి సంఘం, ఏయూ గిరిజన ఉద్యోగుల సంఘం, గిరిజన మహిళా సమన్వయ కమిటీ, రిమోట్ ఏజెన్సీ ట్రైబల్ ఎంపవర్మెంట్ సొసైటీ సంఘీబావం పలికాయి. -
బాక్సైట్ జోలికొస్తే ఖబడ్దార్
తవ్వకాలను అడ్డుకొని తీరుతాం ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతిజ్ఞ సాక్షి, విశాఖపట్నం: ఏజెన్సీలో బాక్సైట్ జోలికి వస్తే ఖబడ్దార్ అని బాక్సైట్ వ్యతిరేక ఐక్య కార్యాచరణ కమిటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రంగా హెచ్చరించింది. విశాఖపట్నంలోని గిరిజన భవన్లో ఆదివారం కమిటీ సదస్సు జరిగింది. బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటామని జేఏసీ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. గిరిజనుల గోడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబులకు వినిపించడం లేదా? పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. రాజధాని ప్రాంతానికి వెళ్లి మీకు నేనున్నానంటూ అక్కడి రైతులకు భరోసా ఇచ్చిన పవన్ కల్యాణ్ తీరా వారి భూములను ప్రభుత్వం లాక్కుంటున్నప్పుడు మాత్రం పత్తా లేకుండాపోయారని విమర్శించారు. బాక్సైట్ తవ్వకాలకు రక్షణ కల్పిస్తామని డీజీపీ రాముడు చెబుతున్నారని, ఎన్ని బలగాలను దించినా తమ 11 మండలాల్లోని గిరిజనులు ఒక్కొక్కరూ ఒక్కో సైనికుడై ప్రతిఘటిస్తారని హెచ్చరించారు. బాక్సైట్ వ్యతిరేక ఉద్యమానికి వైఎస్సార్సీపీ వెన్నుదన్నుగా ఉంటుందని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిసెంబర్ 2న చింతపల్లిలో పర్యటించి, బహిరంగ సభలో పాల్గొంటారని ఈశ్వరి ప్రకటించారు. చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని, అధికారంలో లేనప్పుడు బాక్సైట్‌ను వ్యతిరేకించిన ఆయన అధికారంలోకి వచ్చాక తవ్వడానికి ప్రయత్నిస్తున్నారని సాలూరు ఎమ్మెల్యే పి.రాజన్నదొర ఆరోపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే బాక్సైట్ తవ్వకాలకు బీజం పడిందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజానికి వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా ఒక్క జీఓ కూడా జారీ చేయలేదని గుర్తుచేశారు. బాక్సైట్ తవ్వకాలపై రాష్ట్ర గవర్నర్ నోరు మెదపక పోవడం దారుణమని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్న వాటిని ఆయన అడ్డుకోవాలని కోరారు. -
వైద్య ఆరోగ్య ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు
- సమస్యలు పరిష్కరించాలని మంత్రి లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేత సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖలోని వివిధ ఉద్యోగ సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)గా ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని జేఏసీ ఛైర్మన్ బి.వెంకటేశ్వర్‌రెడ్డి, కన్వీనర్ ఎన్.నారాయణరెడ్డి, ముఖ్య సలహాదారు జూపల్లి రాజేందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జేఏసీ ఏర్పడిన విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకొచ్చామని.. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశామని ముఖ్య సలహాదారు జూపల్లి రాజేందర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య ఉద్యోగులకు సంబంధించి ఏ సమస్య వచ్చినా ఈ జేఏసీతోనే సంప్రదించాలని మంత్రిని కోరారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ట్రెజరీల ద్వారా వేతనాలు అందజేయాలని కోరారు. -
‘రెవెన్యూ’లో పదోన్నతులకు పచ్చజెండా
సాక్షి, హైదరాబాద్: గత పది రోజులుగా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులు జరిపిన ఆందోళనతో ఎట్టకేలకు సర్కారు దిగివచ్చింది. రెవెన్యూ విభాగంలో వివిధ స్థాయిల్లో పదోన్నతులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పదోన్నతుల నిమిత్తం ఈ నెల 20న శాఖాపరమైన పదోన్నతుల(డీపీసీ) క మిటీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూ పరి పాలన విభాగం ముఖ్య(ఇన్చార్జి) కమిషనర్ రాజీవ్‌శర్మ ప్రకటించారు. డిమాండ్ల పరి ష్కారం నిమిత్తం రెవెన్యూ జేఏసీ ప్రతినిధులు సీఎస్‌తో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. గురువారం సీసీఎల్ఏ కార్యాలయంలో జరిగిన చర్చల అనంతరం సీఎస్ రాజీవ్‌శర్మ మీడియాతో మాట్లాడుతూ.. రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించిన పలు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యంగా అర్హులైన డిప్యూటీ తహసీల్దార్ల(డీటీ)కు తహసీల్దారు, తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టరు పదోన్నతులకు సంబంధించిన సీనియారిటీ జాబితాను వెంటనే విడుదల చేయాలని సీసీఎల్ ప్రిన్సిపల్ కమిషనర్‌ను ఆయన ఆదేశించారు. సీనియారిటీ జాబితాపై ఈనెల 16 వరకు ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామని, 20న డీపీసీ సమావేశమై పదోన్నతుల ప్రక్రియను చేపడుతుందన్నారు. షరతులతో పదోన్నతులు.. కమలనాథన్ కమిటీ విభజన ప్రక్రియ కొలిక్కి రానందున తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు ఇచ్చే విషయమై కొన్ని ఇబ్బందులు ఉన్నాయని సీఎస్ చెప్పారు. అయితే.. ఖాళీగా ఉన్న డిప్యూటీ కలెక్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన తహసీల్దార్లకు షరతులతో కూడిన పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కమలనాథ న్ కమిటీ ప్రక్రియ అనంతరం పోస్టులు ఖాళీ ఉండని పక్షంలో.. పదోన్నతులు పొందిన వారు వెనక్కి వెళ్లాల్సి ఉంటుందన్నారు. అలాగే.. కీలకమైన రెవెన్యూ విభాగంలో ఉద్యోగులకు సరైన విశ్రాంతి లభించ నందున, తప్పనిసరి పరిస్థితుల్లో మినహా సెలవు రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిస్తామని సీఎస్ స్పష్టం చేశారు. వీఆర్వోలకు పెన్షనరీ బెనిఫిట్, 010 పద్దు కింద వేతనాలు అందించేందుకు అంగీకరించారు. ఆందోళన విరమిస్తున్నాం: రెవెన్యూ జేఏసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందున, తమ ఆందోళన కార్యక్రమాలను విరమిస్తున్నట్లు రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కృష్ణారెడ్డి, సెక్రటరీ జనరల్ శివశంకర్, కన్వీనర్ లచ్చిరెడ్డి, వీఆర్వోల సంఘం అధ్యక్షుడు రామిరెడ్డి, వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు శివరామ్ ప్రకటించారు. చర్చల్లో సీసీఎల్ఏ ప్రిన్సిపల్ కమిషనర్ అధర్‌సిన్హా, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, ఆర్థికశాఖ కార్యదర్శి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. 3 కేటగిరీలుగా విభజన.. మండల రెవెన్యూ కార్యాలయాలకు పక్కా భవనాలు, తగినంత మంది సిబ్బంది, అవసరమైన మేరకు బడ్జెట్ ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని సీఎస్ రాజీవ్ శర్మ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మండల రెవెన్యూ కార్యాలయాలను మూడు కేటగిరీలుగా విభజిస్తామని, జిల్లా కేంద్రాల్లో, మున్సిపల్ ఏరియాల్లో, గ్రామీణ ప్రాంతాల్లోని ఎంఆర్వో ఆఫీసులను ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజిస్తూ ప్రతిపాదనలను పంపాలని ప్రిన్సిపల్ కమిషనర్‌ను ఆదేశించామన్నారు. -
ఇదీ పింఛన్ల సంగతి !
- ఒక్క కుటుంబంలో ఒక్కరికే పింఛన్.. తక్కినవన్నీ తొలగింపు! - సర్కారు చేపడుతున్న తనిఖీల అంతరార్థం ఇదే! - వీలైనంత వరకూ పింఛన్లను తగ్గించాలని అధికారులు, టీడీపీ నేతలకు ఆదేశాలు - తనిఖీలకు నేడు.. కొత్త పింఛన్లకు రేపు ఆఖరి గడువు - కొత్త, పాత పింఛన్‌దారులకు వచ్చేనెల 2న డబ్బులు అందడం డౌటే! సాక్షి, చిత్తూరు: పీలేరు పట్టణంలోని మాబున్నీసా(పేరుమార్చాం) వయసు 70 ఏళ్లు. నాలుగేళ్ల కిందట కొడుకు చనిపోవడంతో కోడలు ఎలాంటి ఆసరా లేకుండా జీవిస్తోంది. అలాగే మాబున్నీసా మరో కుమారుడు రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయాడు. దీంతో ఈ ఇంట్లో సంపాదన కోసం కష్టపడేవారు ఎవరూ లేరు. ఈ కుటుంబానికి ఓ వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛను రావాలి. అయితే చంద్రబాబు సర్కారు ఇందుకు ససేమిరా అంటోంది. ఇంట్లో ఏదేని ఒక్క పింఛను ఇచ్చి తక్కిన రెండింటినీ తొలగిస్తోంది. తనిఖీల్లో ఈ విషయం టీడీపీ నేతలు స్పష్టం చేయడంతో ఇంటిల్లిపాది బోరుమంటున్నారు. ప్రస్తుతం రెండు రోజులుగా జిల్లాలో పింఛన్‌దారుల తనిఖీ పేరుతో జరుగుతున్న కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నేతలు చేస్తున్న ఘనకార్యానికి ఉదాహరణ పీలేరు మాబున్నీసా కుటుంబవేదన. పింఛను డబ్బులుపెంచుతాం.. అర్హులైన అందరికీ పింఛన్లు ఇస్తామని చంద్రబాబు చేసిన హామీలు నీటిమూటలని తేలిపోయింది. ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్న పింఛనుదారుల తనిఖీల్లో ఈ విషయం సుస్పష్టమవుతోంది. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పింఛను అంటూ అర్హులైన వారి పేర్లను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. దీంతో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు అర్హులు ఉన్నప్పటికీ పింఛను రాక బోరుమంటున్నారు. దీంతో 2004 ముందు పరిస్థితులు పునావృతమవుతున్నాయని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 19న పింఛను తీసుకుంటున్నవారు అర్హులా? కాదా? అని తెలుసుకునేందుకు తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా 19వ తేదీ తనిఖీలకు సిద్ధపడింది. దీంతో పనులకోసం వలసలు వెళ్లిన కొంతమంది పేదలు కుటుంబసభ్యుల సమాచారం మేరకు హుటాహుటిన గ్రామాలకు వచ్చారు. చాలామంది సమాచారం లేక రాలేకపోయారు. సర్కారు అనుకున్నట్లుగానే శుక్రవారం మధ్యాహ్నం వరకూ తనిఖీలు నిర్వహించారు. ఉన్నఫళంగా తనిఖీలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాతి తేదీ వెల్లడించలేదు. దీంతో లబ్ధిదారులు తిరిగి వారి పనులకు వెళ్లారు. ఆదివారం తనిఖీల నిర్వహణ చేపట్టారు. దీనికి ప్రజలకు సమాచారం లేదు. ఆది, సోమ రెండురోజులు తనిఖీలు చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం వరకూ తనిఖీలకు గడువిచ్చారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు ఇవ్వడానికి బుధవారం ఆఖరుగా నిర్ణయించారు. అంతా.. వారి ఇష్టానుసారమే! ప్రస్తుతం జరుగుతున్న తనిఖీల్లో అధికారులు ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారు. టీడీపీ నేతలు చెప్పినట్లు తలూపడం, రికార్డులో పేర్లు చేర్చడం, తొలగించడం మినహా న్యాయబద్ధంగా సర్వే నిర్వహించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే పింఛను అంటూ అసలైన లబ్ధిదారులు ఉన్నా వారి పేర్లను తొలగిస్తున్నారు. ఇదేంటని లబ్ధిదారులు ప్రశ్నిస్తే! ‘వెయ్యి రూపాయలు ఇస్తున్నాం. ఎంతమందికి ఇవ్వాలి? ఇంత డబ్బు ఒకరికి ఇవ్వడమే గొప్ప!’ అంటూ బాహాటంగానే నిష్టూరమాడుతున్నారు. దీంతో మంచి చేస్తారని ఓట్లేసి గెలిపిస్తే.. కొత్త పింఛన్ సంగతి దేవుడెరుగు ఉన్న పింఛను తీసేస్తున్నారంటీ? అంటూ బాధితులు గగ్గోలు పెడుతున్నారు. సగానికి తగ్గించడమే లక్ష్యం జిల్లాలో 4లక్షలమంది పింఛనుదారులకు ప్రతీనెలా 14 కోట్ల రూపాయలను పింఛన్ రూపంలో పంపిణీ చేస్తున్నారు. వెయ్యిరూపాయలకు పింఛను పెంచినా ఉన్న డబ్బులే సరిపోవాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో పింఛన్ల సంఖ్యను 2లక్షలకు పరిమితం చేసేలా అధికారులు, టీడీపీ నేతలు కోతల కార్యక్రమాన్ని చేపట్టారు. రెండో తేదీ డబ్బులు అందడం డౌటే! అక్టోబరు రెండు గాంధీ జయంతిని పురస్కరించుకుని పెంచిన పింఛను సొమ్ముతోపాటు అర్హత ఉండి పింఛన్లు అందనివారికి కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈనెల 24, 25 వరకూ తనిఖీల తంతు తెగేలా లేదు. ఆపై తనిఖీల గడువును పెంచే అవకాశం ఉన్నట్లు కూడా అధికారవర్గాలు చెబుతాయి. ఈ క్రమంలో మార్పులు, చేర్పులు పూర్తయి కొత్త జాబితా సిద్ధమవ్వాలి. ఆ మేరకు డబ్బులు మంజూరు కావాలి. ఇవన్నీ పూర్తయి 2వ తేదీ పింఛన్లు పంపిణీ చేయడం అసాధ్యమని అధికారులు చెబుతున్నారు. దీంతో వెయ్యి రూపాయల పింఛను తీసుకుంటామని ఆశపడిన లబ్ధిదారులు నిరాశకు గురికానున్నారు. అర్హులందరికీ పింఛన్ ఇవ్వాలి అర్హులందరికీ సామాజిక పింఛన్లు ఇవ్వాలని చిత్తూరు జిల్లా ప్రత్యేక ప్రతిభావంతుల సంయుక్త కార్యాచరణ కమిటీ నాయకులు ధర్నా చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఒక కుటుంబంలో ఒకరికే పెన్షన్ అనే విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. ఒక కుటుంబంలో ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది వికలాంగుల ధ్రువీకరణపత్రాలు పొందిన వారు చాలా మంది ఉన్నారని, వీరందరికీ పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. వికలాంగులకు అన్యాయంచేస్తే రాష్ర్ట వ్యాప్తంగా తాము ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. వికలాంగులకు పెన్షన్ తొలగించడం మానవహక్కుల ఉల్లంఘనగా భావిస్తామని వారు హెచ్చరించారు. ఈ ధర్నాలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు మురళి, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, కార్యదర్శులు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
బాబు ఆ రెండు జిల్లాలకే ముఖ్యమంత్రా?
సీమ ఐక్యకార్యాచరణ సమితి ధ్వజం నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ మొత్తానికి కాకుండా రెండు జిల్లాలకే ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా ఉందని రాయలసీమ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన కర్నూలు జిల్లా నంద్యాలలో విలేకరులతో మాట్లాడారు. సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రాజెక్టులను రెండు మూడు జిల్లాలకే పరిమితం చేయడం తగదన్నారు