ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ మొత్తానికి కాకుండా రెండు జిల్లాలకే ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా ఉందని రాయలసీమ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి ఎద్దేవా చేశారు.
సీమ ఐక్యకార్యాచరణ సమితి ధ్వజం
నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ మొత్తానికి కాకుండా రెండు జిల్లాలకే ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా ఉందని రాయలసీమ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన కర్నూలు జిల్లా నంద్యాలలో విలేకరులతో మాట్లాడారు. సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రాజెక్టులను రెండు మూడు జిల్లాలకే పరిమితం చేయడం తగదన్నారు