Dasaratharamireddy
-
వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావాలని..
నాయుడుపేట టౌన్: సంక్షేమ సారథి వైఎస్.జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ స్థానిక రెడ్డి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పాలూరు దశరథరామిరెడ్డి మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గమ్మ గుడికి వెళ్లే ప్రతి మెట్టుకూ పసుపు, కుంకుమ పెట్టి, కర్పూరం వెలిగించి మొక్కుకున్నారు. సూళ్లూరుపేట నియోజవర్గ అభ్యర్థి సైతం అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని కోరారు. -
ప్రపంచంలో 20 కోట్ల మందికి ఆ వ్యాధి.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే ముప్పే
సాక్షి, హైదరాబాద్: కొన్ని ప్రమాదకరమైన వ్యాధులు శరీరంలో రహస్యంగా పొంచి ఉండి ఊహించని రీతిలో అకస్మాత్తుగా బయటపడతాయి. ఆ కోవకు చెందినదే ఈ ఆస్టియోపోరోసిస్ (బోలు ఎముకల వ్యాధి). ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల మందికిపైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. ప్రపంచంలో యాభై ఏళ్లు పైబడిన ముగ్గురు మహిళల్లో ఒకరు, ఐదుగురు పురుషుల్లో ఒకరికి తమ జీవితకాలంలో ఆస్టియోపోరోసిస్ వ్యాధి వల్ల ఎముకలు విరిగే ప్రమాదం ఉంటుందని ప్రముఖ ఆర్ధోపెడిక్ సర్జన్ డాక్టర్ దశరథరామారెడ్డి అంటున్నారు. గురువారం (అక్టోబర్ 20) ప్రపంచ ఆస్టియోపోరోసిస్ డే సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే... ఆస్టియోపోరోసిస్ అంటే? ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి ఎముకలు వాటి ఖనిజ సాంద్రతను కోల్పోయి, పెళుసుబారిపోవడం వల్ల ఏర్పడుతుంది. ఈ వ్యాధి ఎముకలను బలహీనపరిచి అవి విరిగిపోయేలా చేస్తుంది. తుంటి ఎముకలు, పక్క టెముకలు, మణికట్టు ఇంకా వెన్నెముక వంటి ఎముకలు విరిగే (ఫ్రాక్చర్) అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ వ్యాధిని కారణాలను బట్టి వర్గీకరించవచ్చు. ప్రైమరీ ఆస్టియోపోరోసిస్ అనేది సహజమైన వయస్సు సంబంధిత మార్పుల వల్ల ఎముకల సాంద్రత తగ్గి వస్తుంది. సెకండరీ ఆస్టియోపోరోసిస్ కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులవల్ల లేదా మందుల వల్ల కలుగుతుంది. ఈ వ్యాధి లక్షణాలేంటంటే... సాధారణంగా ప్రారంభ దశల్లో ఈ వ్యాధి వస్తే ప్రత్యేకంగా లక్షణాలేవీ కనిపించవు. వ్యాధి క్రమంగా తీవ్రమై ఎముకలు విరిగినప్పుడు మాత్రమే గుర్తించగలం. ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే... వీపు కింది భాగంలో నొప్పి వస్తుంది. పరిస్థితి తీవ్రమైనప్పుడు ఎత్తు తగ్గిపోవడం, వెన్నెముక విరగడం వల్ల శరీరం ముందుకు వంగిపోవడం, శరీర భంగిమల్లో మార్పు, శ్వాస ఆడకపోవడం జరుగుతుంది. పరిస్థితి చాలా తీవ్రంగా మారినప్పుడు బలమైన తుమ్ము లేదా దగ్గు వల్ల కూడా ఎముకలు విరుగుతాయి. వ్యాధి నిర్ధారణ ఎలా చేయగలమంటే? డీఎక్స్ఏ అనే రేడియేషన్ ఎక్స్–రే స్కాన్ ద్వారా తుంటి, ఇంకా వెన్నెముక ఎముకల సాంద్రతను, ఎముకలలోని ఖనిజాల సాంద్రతను కొలవడానికి వీలవుతుంది. ఈ పరీక్షతో వ్యాధిని నిర్ధారించడానికి, ఫ్రాక్చర్ ప్రమాదాన్ని అంచనా వేయడానికి అత్యంత కచ్చితమైన మార్గం. ఇతర వ్యాధులు కూడా ఉన్నట్లయితే రక్తం, మూత్ర పరీక్షలు కూడా అవసరం కావచ్చు. ప్రమాద కారకాలేంటి? ఆస్టియోపోరోసిస్ వ్యాధి ఆడా, మగా ఎవరికైనా రావచ్చు. అయితే ప్రమాదం వయస్సుతో పాటు పెరుగుతుంది. స్త్రీలలో ఈస్ట్రోజెన్ హార్మోన్ వారిని ‘బోన్ లాస్’నుండి కాపాడుతుంది. 50 ఏళ్లు పైబడిన మహిళల్లో (లేదా ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో) ఈస్ట్రోజెన్ లేకపోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ వ్యాధి వచ్చే ప్రమాదం పురుషుల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. క్యాల్షియం, విటమిన్ డీ ఇంకా ఇతర విటమిన్లు, ఖనిజాల కొరతతో కూడిన ఆహారం తీసుకోవడం, సరైన శారీరక బరువును సరిగా నిర్వహించకపోవడం తదితర కారణాలతో ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. జీవనశైలిలో మార్పులు అవసరం కొన్ని జీవనశైలి మార్పులను చేసుకోవాలి. ప్రతి రోజూ వ్యాయామం చేయడం, క్యాల్షియం, విటమిన్ డి వంటి విటమిన్లతో కూడిన ఆహరం ద్వారా లేక మందుల ద్వారా తీసుకోవడం వంటివి చేయాలి. అవసరమైతే కొన్నిసార్లు ఫిజియోథెరపీ కూడా చేయించుకోవాల్సి రావచ్చు. పురుషుల్లో టెస్టోస్టెరాన్ థెరపీ ఎముకల సాంద్రతను పెంచడంలో సహాయపడవచ్చు. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఇవ్వడం ద్వారా ఎముకల సాంద్రత తగ్గడం వల్ల కలిగే నష్టాన్ని ఆపొచ్చు. కేవలం ఆర్థోపెడిక్ సర్జన్ సూచించినట్లయితేనే హార్మోన్ థెరపీ తీసుకోవాలి. -
బాధ్యతతోనే భద్రత
సాక్షి, హైదరాబాద్: ‘కొన్ని దేశాల ప్రధాని స్థాయి వ్యక్తులు మొదలు వివిధ రంగాలకు చెందిన విశిష్ట వ్యక్తుల వరకు అన్ని అధునాతన సదుపాయాలు అందుబాటులో ఉన్నా ఎవరూ కరోనాకు అతీతులు కాదు. ఇది అందరూ గ్రహించాలి’ అని ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు, సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ దశరథరామారెడ్డి తేతలి చెప్పారు. ‘ఈ వైరస్‌కు కులం, మతం, ప్రాంతం, ఆడ–మ గ, ధనిక, పేద అనే తారతమ్యాలు లే వు. ఎవరికైనా వ్యాపించే ప్రమాదముంది. కాబట్టి ఇది సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అందరి కీ సమానమే’నని చెబుతున్న ఆయ న ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ఎదురుకానున్న సవాళ్లు, తదితర అంశాలపై ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. అంతా మన చేతుల్లోనే ఉంది.. కరోనా కేసులు పెరిగి, వైరస్ వ్యా ప్తి పెరిగిన నేపథ్యంలో దీనిని స మర్థవంతంగా అడ్డుకుని, పరిస్థి తి చేదాటకుండా చేసుకోవాలా? లేక మహమ్మారి తీవ్రంగా మారి అందరూ దాని బారినపడే వర కు చేతులు కట్టుక్కుని చూద్దా మా? అనేది అందరూ నిర్ణయించుకోవాలి. ప్రభుత్వాలు, డాక్టర్లు చేయగలిగినంత చేస్తున్నారు. ఇప్పటికే ఈ వైరస్ సోకినవారు, లక్షణాలున్న వారు ఏ మాత్రం తాత్సారం చేయకుండా ముందుకొచ్చి టెస్ట్‌లు చేసుకోవాలి. తప్పక మాస్క్‌లు ధరించడం, మనుషు ల మధ్య ఆరడగులదూరం, హ్యాండ్ శా నిటైజ్, వ్యక్తిగత శుభ్రత, మంచి ఆహా రం తీసుకుంటూ ఎలాంటి భయాల్లేకుండా ఆరోగ్యకర జీవితం గడపడం ఒక్కటే శ్రీరామరక్ష. త మకేమీ కాదని ఇష్టానుసారం రోడ్లపైకి రావడం, విచ్చలవిడిగా తిరగడం మానాలి. అన్ని జాగ్రత్త లు తీసుకుంటూ అంద రూ బాధ్యతగా ఉంటే ఈ వైరస్ నియంత్రణ సాధ్యమే. లాక్డౌన్ నేర్పిన పాఠాలు మనకు లాక్డౌన్ ఎంతో నేర్పింది. మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో తెలియక, ఏ స్థాయి రోగికి ఎలాంటి చికి త్స చేయాలో అర్థం కాక అభివృద్ధి చెందిన దేశా లు సైతం ఇబ్బందిపడ్డాయి. వాటి అనుభవా లు, పరిశోధనలు ఆ తర్వాత మనకు కొంతమేర పనికొచ్చాయి. మనదేశ పరిస్థితులకు తగ్గట్టుగా వివిధ మందులు, చికిత్స విధానాల ను రూపొందించుకుంటున్నాం. ఈ వైరస్ స్ట్రెయిన్లు దేశంలో 200 వరకు, హైదరాబాద్ లో వందకుపైగా ఉన్నట్టు అం చనా. ప్రస్తుత çసమయంలో ఏం చేయాలనేది ఎంత ముఖ్యమో, ఏం చేయకూడదనేదీ అంతకంటే ముఖ్యమే. అం దరూ సురక్షితులయ్యే వరకు ఎవరూ సురక్షితులు కాదు (నో బడీ ఈజ్ సేఫ్ అంటిల్ ఎవ్రీబడీ ఈజ్ సేఫ్), అందరినీ గౌరవించండి, అందరినీ అనుమానించండి (రెస్పెక్ట్ ఆల్ సస్పెక్ట్ ఆల్) అన్న మాటలను అందరూ గుర్తుపెట్టుకోవాలి. కరోనా వస్తే కళంకమేమీ కాదు మొదట్లో వయసు పైబడిన వారు, గుండె, శ్వా సకోశ, కిడ్నీ ఇతర సమస్యలున్న వారు కరోనా తీవ్రత వల్ల మరణించారు. ఇ ప్పుడు తక్కువ వయసున్న వారూ దీని బారిన పడుతున్నారు. వైరల్ లోడ్ పెరగడం, వ్యాధి ముదిరే వరకు దాచి పెట్టుకుని క్రిటికల్ స్టేజ్‌లో ఆసుపత్రులకు రావడం వల్లే ఇలా జరుగుతోంది. కరోనా వచ్చిం దంటే అదేదో కళంకంగా, ప్రతిష్టకు భంగంగా భావిం చొద్దు. వ్యాధి తీవ్రత ఎక్కువున్న కేసుల్లోనే మరణాలు సంభవిస్తున్నాయి. అలాఅని, అందరికీ టెస్ట్‌లు అవసరం లేదు. లక్షణాలు కనిపించే వారితో పాటు, పాజిటివ్‌ల తో కాంటాక్ట్ అయిన వారికి తప్పనిసరి చేయాలి. దీనివల్ల వైరస్ వ్యాప్తిని ఆపొచ్చు. అలా అయితే అది డేంజరే.. నెగెటివ్ వచ్చాక 14 నుంచి 28 రోజుల్లోగా రోగనిరోధకశక్తి స్వాధీనంలోకి వస్తుంది. యాంటీ బాడీస్ పెరిగి ఇమ్యూని టీ పెరుగుతుంది. అయితే ఏడాది పాటే ఈ ఇమ్యూనిటీ ఉంటుందని, మళ్లీ వ్యాధి తిరగబెట్టే అవకాశాలున్నాయనే వార్తలు కలవరపెడుతున్నాయి. దీనిపై ఇంకా పరిశోధన లు జరుగుతున్నాయి. మీజిల్స్, ఆటలమ్మ వంటివి మళ్లీ రావు. మలేరియా, టీబీ మళ్లీ తిరగబెడతాయి. కరోనా కూ డా ఆ జాబితాలో చేరితే అది మనకు హెచ్చరికలాంటిదే. అదే నిజమైతే.. వైరస్ తుంపర్ల (డ్రాప్లెట్ల) ద్వారా వ్యాపిస్తున్నట్టు నిర్ధారణైంది. కొన్ని పరిస్థితుల్లో గాలి ద్వారా కూడా ఇది సోకే అ వకాశాలున్నాయని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. ఇది సైం టిఫిక్గా తేలాలి. ఈ హెచ్చరికను కూడా విస్మరించకూడ దు. కాబట్టి మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒకచోట కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నా మాస్క్ ధరించాలి. వ్యక్తు ల మధ్య దూరం కచ్చితంగా పాటించాల్సిందే. హ్యాండ్ శానిటైజేషన్, వ్యక్తిగత శుభ్రత, పోషకాహారం కలిగిన రోగనిరోధకశక్తి పెంచే ఆహారం తీసుకోవాలి. పరీక్షలు.. మందులు.. వ్యాక్సిన్ కరోనాలోని రకరకాల లక్షణాలు, రోగి స్థితిని బట్టి వ్యాధి తీవ్రత నిర్ధారణకు ఏ టెస్ట్‌లు చేయాలో డాక్టర్లు నిర్ణయిస్తా రు. యాంటీ బాడీస్, యాంటీ జెన్, హెచ్ఆర్సీటీ స్కాన్ ఫర్ లంగ్స్, సీబీపీ–సీఎస్ఆర్–సీ రియాక్టివ్ ప్రోటీన్, ఐ– ఎల్ 6, డీ–డైమర్ టెస్ట్‌లు.. ఇవన్నీ వివిధ పరీక్షల రకాలు. వ్యాధి తొలిదశలో ఉన్న వారి నుంచి వెంటిలేటర్‌పై ఉన్న పేషెంట్ల వరకు అవసరాన్ని బట్టి ఐవీ ఫ్లూయిడ్స్, పారాసిటమిల్, ఫాబిఫెరవీర్, రెమ్‌డిసివర్, టోసిలిజుమాబ్ మం దుల్ని వాడుతున్నారు. డెక్సామిటాజోన్ అనే స్టెరాయిడ్స్ లైఫ్ సేవింగ్ డ్రగ్‌గా ఉపయోగపడుతోంది. ఇంత కంటే ప్రభావితమైన మందుల కోసం పరిశోధనలు సాగుతున్నాయి. ఇక, కొందరు ఇదిగో వ్యాక్సిన్ అంటున్నారు. అయితే సరైన వ్యాక్సిన్ రావడానికి ఇంకా సమయం పడుతుంది. ప్రస్తుతానికివన్నీ పరిశోధనల దశలోనే ఉన్నాయి. -
ఇప్పుడే ముప్పెక్కువ
సాక్షి, హైదరాబాద్: ‘సాధారణంగా మనమంతా ఒక్కో కాలానికి ఒక్కో పేరు పెట్టుకుంటాం. ప్రస్తుతం మనమంతా ‘కరో నా కాలంలో’ బతుకుతున్నాం అనుకోవాలి. ఊహ తెలిశాక ఎ ప్పుడూ చూడని, కనీసం వినని భయానకమైన పరిస్థితిని చూ స్తున్నాం. లాక్డౌన్ సమయంలో ఎన్నో కష్టాలుపడుతూ.. చే యాల్సిన పనులెన్నో ఆపుకుంటూ ఇప్పటివరకు కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ సడలింపు ప్రక్రియ చేపట్టాయి. ఈ వెసులుబాటు ప్రజా సౌలభ్యం కోసమే కానీ, కరోనా ఉధృతి తగ్గినందువల్ల అని అనుకోకూడదు. నిజానికి ఈ సమయంలోనే మన బాధ్యత మరింత పెరగాలి’ అంటున్నారు ప్రముఖ వైద్యుడు డాక్టర్ దశరథరామారెడ్డి. ‘ప్రస్తుతం దేశంలో రోజూ 6,000 కేసులకుపైగా నమోదవుతున్నాయి. అన్ని దేశాల్లో బయటకు కనిపించే సంఖ్య కన్నా, అనధికారికంగా మరిన్ని ఎక్కువగానే కేసులు ఉండొచ్చ’ని చెబుతున్న ఆయన లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కరోనాకు సంబంధించిన ఇతర అంశాలపై చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. ప్రస్తుతానికన్నీ ప్రయోగాలే! కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుం దనేది ఇవాళ అతిపెద్ద ప్రశ్న. అన్ని దేశాలు దీనిపై పరిశోధనలు ముమ్మరం చేశాయి. కానీ, ఎప్పటికప్పుడు వైరస్‌లోని ఆర్ఎన్ఏ ప్రొఫైల్ మారిపోతుండటంతో ఎలాంటి వ్యాక్సిన్ దాన్ని అరికట్టే పరిస్థితి లేదు. మన దేశంలోనూ రెండు మూడు రకాల మందులను దీనికి విరుగుడుగా పనిచేస్తాయా లేదా అని గమనిస్తున్నారు. కానీ ఆశించిన ఫలితం లేదు. ప్రయోగాలైతే జరుగుతున్నాయి. మరో 2 నుంచి 6 నెలల్లో ఈ వ్యాధికి మందు ఏదైనా దొరికే అవకాశం ఉండొచ్చు. మొన్ననే ఇంగ్లాండ్‌లో వ్యాక్సిన్ సక్సెస్ అయ్యిందని మొదట ప్రకటించి తరువాత వెనక్కి తగ్గారు. వ్యాక్సిన్ తయారీలో ఎన్నో అవరోధాలుంటాయి. దశలవారీగా పలు ప్రయోగాలు చెయ్యాలి. అందుకే కరోనా వ్యాక్సిన్ రావడానికి చాలా కాలం పడుతుంది. ఇప్పుడే ఎక్కువ జాగ్రత్త అవసరం లాక్డౌన్ తీసెయ్యగానే కరోనా పోయిందనే భావన సరికాదు. ముఖ్యంగా మనం లాక్డౌన్ సమయంలో ఉన్నప్పటి కంటే మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉంటేనే ఈ మహమ్మారి బారి నుంచి బయటపడగలం. సామూహిక వ్యాప్తి ఇంకా మొదలుకాలేదని అంటున్నా.. వాస్తవిక పరిస్థితులు దాన్నే తలపిస్తున్నాయి. మనం జాగ్రత్తలు పాటించక, పరిస్థితి తారుమారైతే సడలింపులు వెనక్కితీసుకుని, మళ్లీ లాక్డౌన్ విధించాల్సిన అసహాయస్థితికి ప్రభుత్వాలను నెట్టకూడదు. అందుకే మన దగ్గర మరణాలు తక్కువ ప్రపంచ నిష్పత్తితో పోలిస్తే మన దేశంలో కరోనా మరణాల శాతం కాస్త తక్కువే. నవంబర్‌లో వూహాన్లో కరోనా రాకముందే కరోనా కుటుంబానికి చెందిన తక్కువ తీవ్రత కలిగిన కొన్ని వైరస్లు మన దేశంలోకి ప్రవేశించడం, దాన్ని తట్టుకునే ఇమ్యూనిటీ ఉండటం వల్ల మన దేశంలో మరణాలు తక్కువ నమోదవుతున్నాయనేది కొందరు శాస్త్రజ్ఞుల అభిప్రాయం. మిగతా దేశాల్లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణం, జనాభాలో వృద్ధులు ఎక్కువ మంది ఉండటమే. ఆగస్టు వరకు ఆందోళన తప్పదు మన దేశంలో కరోనా బారినపడిన వారిలో బీపీ, షుగర్లాం టి పెద్ద జబ్బులున్న వాళ్లుంటే వారికది ప్రాణాంతకం గా మారుతోంది. ముఖ్యంగా 60ఏళ్లు దాటిన వారు, చిన్న పిల్లలు బయట తిరగకుండా చూసుకోవాలి. ఆగస్టు నాటికి కరోనా తగ్గుముఖం పట్టొచ్చని అంచనా. అప్పటికి హెర్డ్ ఇమ్యూనిటీ (జనాభాలో 60 నుంచి 70% మందికి వైరస్సోకి వారిలో వ్యాధి నిరోధకశక్తి వృద్ధి చెందడం) పెరి గితే అప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అప్పుడిక ఈ వైరస్ మిగతా ఫ్లూల మాదిరిగానే సీజనల్‌గా మారిపోతుంది. విషమమైతే తప్ప ప్రాణహాని చేయదు. రెస్పెక్ట్ ఆల్.. సస్పెక్ట్ ఆల్ ► ప్రస్తుత పరిస్థితుల్లో భౌతికదూరం పాటించడం తప్ప వేరే మార్గం లేదు. కచ్చితంగా మన చుట్టుపక్కల ఉన్న మనుషుల నుంచి ఆరడుగుల దూరాన్ని పాటిస్తే కరోనా వచ్చే అవకాశాన్ని 90శాతం తప్పించుకున్నట్టే. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి. ► కళ్లు, ముక్కు, నోటి వద్ద చేతివేళ్లతో తాకొద్దు. పొరపాటున ఎక్కడైనా చేత్తో కరోనా ఉన్న వస్తువులని తాకి ఉన్నట్టయితే, పై శరీర భాగాల ద్వారా మనకు కరోనా సంక్రమించే ప్రమాదం ఉంది. ► బయటకి, మరెక్కడికి వెళ్లొచ్చినా శానిటైజర్‌తో చేతులు పూర్తిగా, కచ్చితంగా కడుక్కోవాలి. బయటకు వెళ్లినప్పుడు వేసుకున్న బట్టలు, ఉతకకుండా మరోసారి వాడకూడదు. ► ఇంట్లో ఏసీకి ఉన్న ఫిల్టర్ మార్చుకోవడం మంచిది. 24 డిగ్రీలు లేదా ఆపై సెట్టింగ్ ఉంచాలి. ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటే ఇంకా మంచిది. ► క్లాత్ మాస్క్ కానీ ఎన్–95 మాస్కు కానీ ధరిస్తేనే మంచిది. సన్నటి మాస్కులు వాడటం వల్ల ఫలితం లేదు. ► కొందరు కరోనా తగ్గడానికి మందులంటూ ఇళ్లకు వచ్చి అమ్ముతూ బాగా క్యాష్ చేసుకుంటున్నారు. అలాంటి మందులకు శాస్త్రీయత లేదు. ► ఆరోగ్యకరమైన, ఇమ్యూనిటీని పెంచే ఆహారాన్ని తప్ప దేనినీ కరోనాకి మందుగా భావించవద్దు. ప్రస్తుతానికి నివారణను మించిన చికిత్సలేదు. ► కరోనాకు సంబంధించి ఎవరి విషయంలోనూ అలసత్వం, అతి నమ్మకం వద్దు. వేరొకరి నుంచి మనకెంత ముప్పుందో మన నుంచీ ఇతరులకూ అంతే ముప్పుంది. అందుకే రెస్పెక్ట్ ఆల్.. సస్పెక్ట్ ఆల్. -
బాబు ఆ రెండు జిల్లాలకే ముఖ్యమంత్రా?
సీమ ఐక్యకార్యాచరణ సమితి ధ్వజం నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ మొత్తానికి కాకుండా రెండు జిల్లాలకే ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా ఉందని రాయలసీమ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన కర్నూలు జిల్లా నంద్యాలలో విలేకరులతో మాట్లాడారు. సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రాజెక్టులను రెండు మూడు జిల్లాలకే పరిమితం చేయడం తగదన్నారు