
నాయుడుపేట టౌన్: సంక్షేమ సారథి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ స్థానిక రెడ్డి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పాలూరు దశరథరామిరెడ్డి మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గమ్మ గుడికి వెళ్లే ప్రతి మెట్టుకూ పసుపు, కుంకుమ పెట్టి, కర్పూరం వెలిగించి మొక్కుకున్నారు. సూళ్లూరుపేట నియోజవర్గ అభ్యర్థి సైతం అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని కోరారు.