సంక్షేమ ప్రభుత్వంపై బురద జల్లేందుకు తెలుగుదేశం పన్నాగం | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ ప్రభుత్వంపై బురద జల్లేందుకు తెలుగుదేశం పన్నాగం

Published Thu, Feb 22 2024 1:18 AM | Last Updated on Thu, Feb 22 2024 5:54 PM

- - Sakshi

సాక్షి, తిరుపతి: ప్రజల విశేష జనాదరణ కలిగిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా ఊరూరా దుష్ప్రచారానికి కుట్రపన్నారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా కూలీలను నియమించుకుంటున్నారు. ఒక్కోనియోజకవర్గానికి ప్రత్యేక బృందాలను రిక్రూ ట్‌ చేసుకుంటున్నారు. ఈ పనికి స్థానికులు ముందుకు రాకపోతే పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వీరికి రోజుకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు చెల్లిస్తున్నారు. దీనికోసం భారీగా నిధులు సమీకరించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా నారాయణ విద్యాసంస్థల విద్యార్థులతో చంద్రబాబు అసత్య ప్రచారం చేయిస్తుండడం గమనార్హం.

అధికార పార్టీని దెబ్బతీసేందుకు ఆపసోపాలు..
ఎన్నికలు సమీపిస్తుండడంతో టీడీపీలో వణుకు మొదలైంది. వైఎస్సార్‌సీపీ చేపడుతున్న ‘సిద్ధం’ ఎన్నికల శంఖారావ సభలకు వస్తున్న ఆదరణ చూసి ఉలిక్కిపడుతోంది. ఎలాగైనా అధికార పార్టీని దెబ్బతీయాలని కుట్రలు పన్నుతోంది. గతంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వెళ్లిన పాతకాపులను కలిసి తిరిగి రావాలని ప్రాధేయపడుతోంది. వారి నుంచి స్పందన రాకపోవడంతో ప్రజల్లో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యతిరేకత ఉందని చూపేందుకు ఆపసోపాలు పడుతోంది.

ప్రతి జిల్లాకు సోషల్‌ మీడియా దుష్టకూటమి..
వీరు కాకుండా టీడీపీలో అత్యంత నమ్మకంగా ఉన్న పార్టీ శ్రేణులతో ప్రతి జిల్లాలో ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేశారు. వీరి ఆధార్‌ కార్డులు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు సేకరించారు. రోజూ ప్రభుత్వంపై వ్యతిరేక, టీడీపీ అనుకూల నినాదాలను వీరు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయాలి. వాటిని పార్టీ నాయకులు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్ర్ట్రాగాం, యూట్యూబ్‌లో తిరిగి పోస్ట్‌ చేసేలా పన్నాగం పన్నారు. బురద చల్లే బ్యాచ్‌ ఖర్చుల కోసం టీడీపీ పెద్దఎత్తున నిధులు సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నిధులను ఎన్‌ఆర్‌ఐలు, అమరావతికి చెందిన భూస్వాములు, కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు, కార్పొరేట్‌ ఆస్పత్రుల నుంచి సమీకరించినట్లు సమాచారం.

కుప్పంలో ప్రారంభం..
కుప్పం నియోజకవర్గంలో అన్నికులాల వారిని కలసి తాము నియమించిన బృందాలు రాష్ట్రప్రభుత్వంపై దుష్ప్రచారం చేయించేందుకు మొదలుపెట్టారు. ప్రతి కులానికి పదిమంది సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఎన్నికలు ముగిసేంత వరకు ఆయా సామాజిక వర్గాల వారితో టచ్‌లో ఉండే విధంగా ప్లాన్‌ చేశారు. ఇందుకోసం టీడీపీ ఫోరం పేరిట బెంగళూరు చెందిన 200మందిని కుప్పానికి తీసుకొచ్చారు. వీరు ప్రతి బూత్‌లో పర్యటించి ప్రభుత్వంపై బురద చల్లేందుకు దుష్ప్రచారం చేస్తున్నారు.

మరో 2వేల మంది టీడీపీ సానుభూతిపరులు
ఈ రెండు వందల మందే కాకుండా టీడీపీలో నమ్మకంగా ఉన్న పార్టీ శ్రేణులను జిల్లాకు రెండు వేల మందిని ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేస్తున్నారు. వీరి ఆధార్‌ కార్డులు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు సేకరించారు. ప్రతి రోజూ ఒక్కో కార్యకర్త పేరుతో రోజూ నాలుగు సార్లు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తారు. వాటిని పార్టీ నాయకులు ఫేజ్‌ బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్ర్ట్రాగాం, యూటూబ్‌లో పోస్ట్‌ చేసి వైరల్‌ చేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement