తిరుపతి అర్బన్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం జిల్లాకు రానున్నారు. ఈ సందర్భంగా తిరుపతిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. శ్రీతాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకోనున్నారు. అనంతరం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు తిరుమలకు చేరుకోనున్నారు. ఈ మేరకు అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు. పర్యటన వివరాలు ఇలా..
► ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం 3.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు.
► 3.25కి ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 3.50 గంటలకు తిరుచానూరు మార్కెట్ యార్డ్ సమీపంలోని సభా ప్రాంగణానికి విచ్చేస్తారు.
► శ్రీనివాస సేతు, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల నూతన హాస్టల్ భవనాల ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు.
► టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయింపు పత్రాలను పంపిణీ చేసి 4.20 గంటలకు బయలుదేరుతారు.
► 4.30 గంటలకు గంగమ్మను దర్శించుకుంటారు.
► 4.55కు బయలుదేరి, 5.40 గంటలకు తిరుమలకు చేరుకుని వకుళమాత అతిథిగృహం, అనంతరం 5.55కి రచన గెస్ట్‌హౌస్ ప్రారంభిస్తారు.
► 6.10గంటలకు శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకు ని 7.40 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు.
► అనంతరం రాత్రి 7.45 బేడీ ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుంటారు.
► 7.55 నుంచి 9.10 వరకు శ్రీవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. టీటీడీ క్యాలెండర్– 2024 ఆవిష్కరిస్తారు. పెద్ద శేష వాహనసేవలో పాల్గొంటారు.
► 9.15 గంటలకు శ్రీపద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.
► మంగళవారం ఉదయం 6.10 గంటలకు శ్రీపద్మావతి అతిఽథి గృహం నుంచి బయలుదేరి 6.20 గంటలకు శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. స్వామివారి దర్శనానంతరం 6.50 గంటలకు పద్మావతి అతిథి గృహానికి బయలుదేరుతారు. అల్పాహారం తీసుకుని, 7.35 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు తిరుగుప్రయాణమవుతారు.
► 9గంటలకు రేణిగుంట నుంచి విమానంలో కర్నూల్ జిల్లా ఓర్వకల్లుకు బయలుదేరుతారు.
సమన్వయంతో పనిచేయాలి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఆదేశించారు. ఆదివారం ఈమేరకు సీఎం పర్యటించనున్న ప్రాంతాలను తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ హరితతో కలిసి ఆయన సందర్శించారు. ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. కట్టుదిట్టంగా భద్రతా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా సమష్టిగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీడీసీఎల్ ఎస్‌సీ కృష్ణారెడ్డి, డీపీఆర్‌ఓ బాల కొండయ్య, గంగమ్మ గుడి చైర్మన్ గోపీయాదవ్, ఈఓ ముని కృష్ణయ్య, సెట్విన్ సీఈఓ మురళీకృష్ణ పాల్గొన్నారు.
నగరానికి మణిహారం
తిరుపతి తుడా : తిరుపతికి మణిహారం శ్రీనివాస సేతును ముఖ్యమంత్రి సోమవారం ప్రారంభించనున్నట్లు స్మార్ట్‌సిటీ ఎండీ హరిత తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment