ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
శ్రీకాళహస్తి: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే స్కౌట్స్ అండ్ గైడ్స్ లక్ష్యమని జిల్లా విద్యాశాఖధికారి కేవీఎన్.కుమార్ స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి సరస్వతి బాయ్ పురపాలక ఉన్నత పాఠాశాలలో జరుగుతున్న గైడ్ కెప్టెన్ల ట్రైనింగ్ క్యాంపును ఆయన శనివారం సందర్శించారు. అనంతరం స్కౌట్స్ ఉద్యమ వ్యవస్థాపకులు లార్డ్ మౌంట్ బేడన్ పావెల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. లీడర్ ట్రైనర్ శకుంతలమ్మ, జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎం. కుప్పిరెడ్డి, అసిస్టెంట్ ట్రైనర్ ధనలక్ష్మి, ఎంఈఓ భువనేశ్వరి, కార్యాలయ కమిషనర్ టీ.రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి ఎం.జయరామ, అసిస్టెంట్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ ఎన్. కోటేశ్వరరావు, డీఓసీ సతీసావిత్రి, స్కౌట్ మాస్టర్ హేమకుమార్, యూత్ చైర్మన్ అజారుద్దీన్, ఏఎంఓ శివశంకరయ్య, స్కౌట్ మాస్టర్లు యోగానందం, సుబ్రహ్మణ్యం, మహేంద్ర, మణికంఠ పాల్గొన్నారు.
డీడీఈ పరీక్షలు మళ్లీ వాయిదా
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న డీడీఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు డీడీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ తవమణి శనివారం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 24 నుంచి మార్చి 15వతేదీ వరకు జరగనున్న దూరవిద్యకు సంబంధించిన యూజీ, పీజీ పరీక్షలను ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు తెలియజేశారు. పరీక్షల నిర్వహణ తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment