అన్ని అవయువాలున్న మానవుడే నాకిది కావాలని కొన్ని సందర్భాల్లో గట్టిగా అడగ లేడు. ఇక మూగజీవాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వాటికి వచ్చే బాధలు, జబ్బులు చెప్పుకోలేక ఎంత నలిగిపోతుంటాయో మాటల్లో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి వాటి సంరక్షణే ధ్యేంగా గత ప్రభుత్వం అడుగులు వేసింది. 108 వాహనాల మాదిరిగా గ్రమీణ పశువైద్య ఆరోగ్య సేవా సంచార వాహనాలను ఏర్పాటు చేసింది. పల్లెలకే వెళ్లి వైద్యం చేసేలా చర్యలు చేపట్టింది. పాడి రైతులకు కొండంత భరోసా కల్పించింది.
నేడు
కూటమి ప్రభుత్వం అధికారంలొకొచ్చాక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రజలకు ఏది మంచి జరగకపోయినా పర్వాలేదు.. గత ప్రభుత్వ ఆనవాళ్లు ఉండకూడదని భావిస్తోంది. ఇందులో భాగంగానే పశువైద్య ఆరోగ్య సేవా సంచార వాహనాలను మూలన పడేసింది. మూగ జీవుల ప్రాణాలతో చెలగాటమాడుతూ.. పాడి రైతులను నట్టేట ముంచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment