గ్రూప్–2 పరీక్ష కేంద్రాల పరిశీలన
తిరుపతి క్రైమ్: తిరుపతిలో ఆదివారం జరగనున్న గ్రూప్– 2 పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు శనివారం పరిశీలించారు. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, ఇంటర్మీడియెట్ కళాశాల, ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో శనివారం గ్రూప్–2 పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రూప్–2 పరీక్షా కేంద్రానికి దగ్గరగా ఉన్న దుకాణాలు, నెట్ సెంటర్లను మూసివేయాలన్నారు. తిరుపతిలో 13 సెంటర్లలో గ్రూప్–2 ఎగ్జామ్స్ జరుగుతాయని, దానికి సంబంధించి డీఎఫ్‌ఎంఎంఎఫ్ సెక్యూరిటీ పరంగా ఏర్పాటు చేసామన్నారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, వాచ్‌లు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు తీసుకురాకూడదని సూచించారు. ఆయన వెంట ట్రైనీ ఐపీఎస్ హేమంత్ , అదనపు ఎస్పీ పరిపాలన రవిమనోహరాచారి, డీఎస్పీ శ్రీలత, సీఐ రామయ్య ఉన్నారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 10 కంపార్ట్‌మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 65,327 మంది స్వామివారిని దర్శించుకోగా 22,804 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.52 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
నేడు గ్రూప్–2 పరీక్షలు
తిరుపతి అర్బన్ : తిరుపతి నగరంలోని 13 కేంద్రాల్లో ఆదివారం ఏపీపీఎస్సీ గ్రూప్–2 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. రెండు సెషన్స్‌లో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు ఒక సెషన్, అలాగే మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్ష నిర్వహించ నున్నట్టు తెలిపారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు 1.30 గంటల ముందే చేరుకోవాలని సూచించారు. విద్యార్థుల కోసం బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నారు.
యధావిధిగా పరీక్షలు
జేసీ శుభం బన్సల్ విలేకరులతో మాట్లాడారు. కొన్ని సామాజిక మాధ్యమాల్లో గ్రూప్–2 పరీక్షలు వాయిదా అంటూ ప్రచారం జరుగుతోందన్నారు. దాన్ని నమ్మొద్దన్నారు. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయన్నారు.
ఆర్డీఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్
తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసినట్టు ఆర్డీఓ రామమోహన్ తెలిపారు. ఇబ్బందులుంటే 7032157040 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment