మహాశివరాత్రికి 436 సర్వీసులు
తిరుపతి అర్బన్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో జిల్లాలోని పలు డిపోల నుంచి 436 ఆర్టీసీ సర్వీసులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు డీపీటీఓ నరసింహులు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ 25న 87 సర్వీసులు, 26న 209, 27న 140 సర్వీసులు నడపనున్నట్టు చెప్పారు. శ్రీకాళహస్తి, తలకోన, సదాశివకోన, కై లాసకోన, అవంతి, ఊతుకోట, గాజులమండ్యం, మూలకోన, యాకసిరితిప్ప ప్రాంతాలకు సర్వీసులు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. తిరుపతి డిపో నుంచి 110 సర్వీసులు, మంగళం డిపో నుంచి 7, శ్రీకాళహస్తి డిపో నుంచి 155, పుత్తూరు డిపో నుంచి 116, సత్యవేడు డిపో నుంచి 25, వాకాడు నుంచి 17, గూడూరు డిపో నుంచి 6 బస్సులు మహాశివరాత్రికి కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment