యువోత్సాహం
● మిన్నంటిన ఐఐటీ తిరుత్సవ–2025
సంబరాలు
● ఉర్రూతలూగించిన ప్రఖ్యాత డీజే ఆర్టిస్ట్ డీజే రుహూన్ ప్రదర్శన
● నేటితో ముగియనున్న టెక్నో కల్చరల్ ఫెస్ట్
రేణిగుంట(ఏర్పేడు): తిరుత్సవ పేరిట ఐఐటీలో ప్రతియేటా నిర్వహించే సాంస్కృతిక సంబరాలు ఈ ఏడాది కూడా యువోత్సాహంతో మిన్నంటాయి. ఏర్పేడు సమీపంలోని ఐఐటీ ప్రాంగణంలో ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ పర్యవేక్షణలో విద్యార్థుల కమిటీ ఆధ్వర్యంలో తిరుత్సవ సంబరాలు సాగుతున్నాయి. శనివారం ఉదయం విద్యార్థుల బృందం మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు మెదడుకు పదును పెట్టారు. ఎస్కేప్ రూమ్, కౌన్ బనేగా కరోడ్‌పతి, స్క్వాడ్ గేమ్స్, ఫ్యాషన్ షో ప్రదర్శనలు సాయి. సాయంత్రం విద్యార్థుల బ్యాండ్ ప్రదర్శన ఆకట్టుకుంది.
నేటితో ముగియనున్న సంబరాలు
తిరుత్సవ –2025 సంబరాల్లో చివరి రోజు ఆదివారం ట్రెషర్ హంట్, టెక్ హీస్ట్ ఫైనల్స్, పాప్ కల్చరల్ క్విజ్, క్రికెట్–ఓ మ్యానియా, రాత్రి సినీ సింగర్ హరిచరణ్, శిరీష బృందం ప్రదర్శలతో ముగియనున్నాయి.
కట్టిపడేసిన డీజే ప్రదర్శన
రాత్రి డీజేర్టిస్ట్ డీజే రుహూన్ ప్రదర్శన ఆద్యంతం వీక్షకులను కట్టిపడేసింది. హుషారైన పాప్ గీతాలతో ఆమె చేసిన డీజే నృత్యాలతో ఐఐటీ ప్రాంగణం హోరెత్తింది. ఐఐటీ విద్యార్థులే కాకుండా బయట నుంచి వచ్చిన వారు నృత్యాలు చేస్తూ కేరింతలతో ఈవెంట్‌ను ఆస్వాదించారు.
యువోత్సాహం
యువోత్సాహం
Comments
Please login to add a commentAdd a comment