కనుల నిండుగా..కవలల పండుగ!
● ఒకే వేదికపై 100 మంది కవలలు ● ఘనంగా అంతర్జాతీయ కవలల దినోత్సవం
తిరుపతి సిటీ: అమ్మ గీసిన అచ్చు బొమ్మలు తిరుపతి నగరంలో హల్‌చల్ చేశారు. అంతర్జాతీయ కవలల దినోత్సవం సందర్భంగా స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ట్వీన్స్ మీట్–2025 కార్యక్రమానికి పలు ప్రాంతాల నుంచి సుమారు 100మంది కవలలు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్‌చేసి ఒకరినొకరు ట్వీన్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు చేసుకున్నారు. అనంతరం సాంస్కృత కార్యక్రమాలలో మునిగితేలారు. నిర్వాహకులు హేమావతి, హేమలత ట్వీన్స్ మాట్లాడుతూ ప్రతి ఏడాదీ తిరుపతిలో అంతర్జాతీయ కవలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది పలు రాష్ట్రాలలో ఉద్యోగాలు చేస్తున్న తెలుగు యువ కవలలు, చిన్నారులు వారి తల్లుదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరవడం సంతోషంగా ఉందన్నారు. తొలిసారిగా ట్విన్స్ గ్రూప్‌ను తాము క్రియేట్ చేయడంలో స్వల్ప కాలంలోనే అందరూ ట్విన్స్ గ్రూప్‌లో కలిశామని, దీంతో కవలల దినోత్సవాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment