విభజన హామీల నేపథ్యంలో తెలుగుదేశం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం పోతోందని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వనరులు లేని రాష్ట్రంలో అవినీతి జరిగిందని వార్తలు రావడం బాధాకరమని పేర్కొన్నారు. కేంద్రబడ్జెట్‌లో విభజన హామీలు అమలు కాలేదని, విభజన హామీలను గాలికొదిలేశారని విమర్శించారు. తనకు అనుభవం లేకపోవడం వల్ల గత ఎన్నికల్లో చంద్రబాబు, మోదీకి మద్దతు ఇచ్చానని అభిప్రాయపడ్డారు.