అధికార తెలుగుదేశం పార్టీతో ఎలాంటి సంబంధం లేదని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. ఏదో ఎన్నికలప్పుడు మద్దతు ఇచ్చానేతప్ప తాను ‘టీడీపీ పార్ట్‌నర్’ను కానని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన పవన్.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన దిశగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విసిరిన సవాలుపై స్పందించారు.