నగరంలో డబుల్ ఇళ‍్లకు శంకుస్థాపన
Published Sat, Apr 22 2017 12:02 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
హైదరాబాద్: నగరంలోని మారియట్ హోటల్ వద్ద 180 యూనిట్ల డబుల్ బెడ్‌రూం అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు శనివారం ఉదయం భూమిపూజ చేశారు. రూ.15.57 కోట్ల వ్యయంతో బన్సీలాల్‌పేట్ డివిజన్‌లోని జీవైరెడ్డి కాంపౌండ్ కవాడిగూడలో వీటిని నిర్మించనున్నారు. ఈ కార‍్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూమి పూజ కార్యక్రమం అనంతరం మంత్రి కేటీఆర్ బస్నీలాల్ పేటలో పర్యటించారు.
Advertisement