హైదరాబాద్: నాంపల్లి కోర్టులో మోడల్ చిల్ట్రన్స్ కోర్టు ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. హైకోర్టు చీఫ జస్టిస్ రమేష్ రంగనాథన్ బుధవారం మోడల్ చిల్డ్రన్స్ కోర్టును ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో డీజీపీ అనురాగ్ శర్మ, మెట్రోపాలిటన్ సెషెన్స్ జడ్జి రజిని, ఐజీ సౌమ్యా మిశ్రా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ అనురాగ్ శర్మ మాట్లాడుతూ.. గోవా, ఢిల్లీ తరువాత ఇప్పుడు హైదరాబాద్లో ఏర్పాటైన కోర్టు దేశంలోనే మూడోదని పేర్కొన్నారు.
రాబోయో రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్లా మోడల్ చిల్డ్రన్స్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. కేసుల విచారణలో చిన్నారులు భయాందోళనలకు గురికాకుండా ఉండేందుకే మోడల్ చిల్డ్రన్స్ కోర్టును ఏర్పాటు చేసినట్టు తెలిపారు. స్నేహపూరితమైన వాతావరణంలో కేసుల విచారణ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చిన్నారులకు కౌన్సెలింగ్ కూడా ఇస్తామని డీజీపీ వెల్లడించారు.
నాంపల్లి కోర్టులో మోడల్ చిల్డ్రన్స్ కోర్టు
Published Wed, Aug 24 2016 12:01 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
Advertisement