సుప్రీం ప్రశ్నలకు మోదీ సమాధానమివ్వాలి
- సీపీఐ నేత సురవరం డిమాండ్
- పెద్ద మొత్తంలో రూ. 2 వేల నోట్లు నల్ల కుబేరులకు ఎలా చేరుతున్నాయి?
సాక్షి, హైదరాబాద్: పెద్ద మొత్తంలో కొత్త రూ. 2 వేల నోట్లు పట్టుబడుతుండటం, ఆ నోట్లు నల్ల కుబేరులకు ఎలా చేరుతున్నాయన్న దానిపై సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాషా, పల్లా వెంకటరెడ్డి, ఆదిరెడ్డిలతో కలసి ఆయన శుక్రవారం విలేక రులతో మాట్లాడుతూ, సామాన్య ప్రజలకు ఏటీఎంలలో రూ.రెండు వేల నోటు దొరకడ మే గగనమైనపుడు, లక్షల కోట్ల నల్లధనం దందా చేసే వారికి ఎలా చేరాయన్నది కీలక మైన ప్రశ్న అని తెలిపారు. ‘బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలకు అనుగు ణంగా అహ్మదాబాద్‌లో రూ.కోట్లు బదలా యించడం తనను కలచివేసింద’ని గుజరా త్‌లో మంత్రిగా పనిచేసిన ఒక నేత మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారని తెలిపారు. దీనిపై మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పెద్ద నోట్లు రద్దు నిర్ణయం తర్వాత నల్లధనం బయటకు రాలేదని, రోజువారీ ఖర్చుల కోసం దాచుకున్న వారి డబ్బే బ్యాంకుల్లో జమైందన్నారు. పార్లమెంట్‌లో తనను మాట్లాడ నీయడం లేదు కాబట్టి జనసభల్లో మాట్లాడు తున్నానని మోదీ స్థాయిని మరిచిపోయి చెబుతున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్ సమావేశాలను సక్రమంగా నిర్వహించకపోవడంపై బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ స్వయంగా ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించారని, అయితే ఆ వ్యాఖ్యలు విపక్షాలను ఉద్దేశిం చినవంటూ కొత్త అబద్ధాలతో మాయ చేసేం దుకు కేంద్రమంత్రి వెంకయ్య ప్రయ త్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి
పెద్ద నోట్ల రద్దు కారణంగా రాష్ట్ర ప్రజలు పడుతున్న ఘోషను వినిపించేలా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని సురవరం సూచించారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు కలుగుతున్న అసంతృప్తిని తెలియజేస్తూ కొత్త మారకంపై డబ్బు ఎప్పటిలోగా పంపిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీకి ఆగ్రహం తెప్పించడం ఇష్టం లేకనో, ఆయనకు వ్యతిరేకమనే అభిప్రాయం ఏర్పడుతుందనే భయంతోనో ఉండకుండా ప్రజల సమస్యలు తెలియజేయాలని కేసీఆర్‌కు సూచించారు.
20వ తేదీ నుంచి జాతీయ సమావేశాలు
ఈ నెల 20న సీపీఐ జాతీయ కార్య వర్గం, 21–23 తేదీల్లో జాతీయ కౌన్సిల్ సమావేశాలు హైదరాబాద్‌లోని మగ్దూం భవన్‌లో జరగనున్నట్లు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి తెలిపారు. ఈ సమావేశాల్లో పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలు, ప్రధానిపై వచ్చిన అవినీతి ఆరో పణలు, సహారా, బిర్లా పేపర్లలో వచ్చిన అంశాలు, అయిదు రాస్ట్రాలకు జరగనున్న ఎన్నికలపై చర్చించనున్నట్లు తెలియజేశారు.