Suvarnam
-
పౌరహక్కుల నేతలను విడుదల చేయాలి
ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్‌కు సురవరం లేఖ సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన మేధావులు, పౌరహక్కుల నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేసి వారిని విడుదల చేయాలని ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్‌ను సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి కోరారు. ఛత్తీస్ గఢ్‌లో క్షేత్రస్థాయి పరిస్థితుల అంచనాకు నిజ నిర్ధారణ కమిటీగా వచ్చిన పలువురిని నక్సలైట్లుగా ముద్ర వేసి జైలులో పెట్టారని లేఖలో పేర్కొన్నారు. వారిని ఏపీ పోలీసులు భద్రాచలంలో అరెస్ట్ చేసి ఛత్తీస్‌గఢ్ పోలీసులకు అప్పగించి నట్లు తెలిపారు. నిజంగా నక్సలైట్లయితే తాము ఛత్తీస్‌గఢ్‌కు వెళ్తున్నట్లు బహిరంగంగా ఎందుకు ప్రకటిస్తారని ప్రశ్నించారు. -
సుప్రీం ప్రశ్నలకు మోదీ సమాధానమివ్వాలి
- సీపీఐ నేత సురవరం డిమాండ్ - పెద్ద మొత్తంలో రూ. 2 వేల నోట్లు నల్ల కుబేరులకు ఎలా చేరుతున్నాయి? సాక్షి, హైదరాబాద్: పెద్ద మొత్తంలో కొత్త రూ. 2 వేల నోట్లు పట్టుబడుతుండటం, ఆ నోట్లు నల్ల కుబేరులకు ఎలా చేరుతున్నాయన్న దానిపై సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాషా, పల్లా వెంకటరెడ్డి, ఆదిరెడ్డిలతో కలసి ఆయన శుక్రవారం విలేక రులతో మాట్లాడుతూ, సామాన్య ప్రజలకు ఏటీఎంలలో రూ.రెండు వేల నోటు దొరకడ మే గగనమైనపుడు, లక్షల కోట్ల నల్లధనం దందా చేసే వారికి ఎలా చేరాయన్నది కీలక మైన ప్రశ్న అని తెలిపారు. ‘బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలకు అనుగు ణంగా అహ్మదాబాద్‌లో రూ.కోట్లు బదలా యించడం తనను కలచివేసింద’ని గుజరా త్లో మంత్రిగా పనిచేసిన ఒక నేత మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారని తెలిపారు. దీనిపై మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్ద నోట్లు రద్దు నిర్ణయం తర్వాత నల్లధనం బయటకు రాలేదని, రోజువారీ ఖర్చుల కోసం దాచుకున్న వారి డబ్బే బ్యాంకుల్లో జమైందన్నారు. పార్లమెంట్లో తనను మాట్లాడ నీయడం లేదు కాబట్టి జనసభల్లో మాట్లాడు తున్నానని మోదీ స్థాయిని మరిచిపోయి చెబుతున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్ సమావేశాలను సక్రమంగా నిర్వహించకపోవడంపై బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ స్వయంగా ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించారని, అయితే ఆ వ్యాఖ్యలు విపక్షాలను ఉద్దేశిం చినవంటూ కొత్త అబద్ధాలతో మాయ చేసేం దుకు కేంద్రమంత్రి వెంకయ్య ప్రయ త్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి పెద్ద నోట్ల రద్దు కారణంగా రాష్ట్ర ప్రజలు పడుతున్న ఘోషను వినిపించేలా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని సురవరం సూచించారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు కలుగుతున్న అసంతృప్తిని తెలియజేస్తూ కొత్త మారకంపై డబ్బు ఎప్పటిలోగా పంపిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీకి ఆగ్రహం తెప్పించడం ఇష్టం లేకనో, ఆయనకు వ్యతిరేకమనే అభిప్రాయం ఏర్పడుతుందనే భయంతోనో ఉండకుండా ప్రజల సమస్యలు తెలియజేయాలని కేసీఆర్‌కు సూచించారు. 20వ తేదీ నుంచి జాతీయ సమావేశాలు ఈ నెల 20న సీపీఐ జాతీయ కార్య వర్గం, 21–23 తేదీల్లో జాతీయ కౌన్సిల్ సమావేశాలు హైదరాబాద్‌లోని మగ్దూం భవన్లో జరగనున్నట్లు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి తెలిపారు. ఈ సమావేశాల్లో పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలు, ప్రధానిపై వచ్చిన అవినీతి ఆరో పణలు, సహారా, బిర్లా పేపర్లలో వచ్చిన అంశాలు, అయిదు రాస్ట్రాలకు జరగనున్న ఎన్నికలపై చర్చించనున్నట్లు తెలియజేశారు. -
కేసీఆర్ ది ఫ్యూడల్ పాలన: సురవరం
-
కేసీఆర్ ది ఫ్యూడల్ పాలన
• సీఎం కేసీఆర్‌పై సురవరం మండిపాటు • నోట్ల రద్దుపై నేరుగా నిరసన తెలపలేకపోయారు • రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్నారు సాక్షి, వరంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోలేని పిరికిపంద అని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీ ముందస్తు ఏర్పాట్లు చేయకుండా పెద్ద నోట్లు రద్దు చేస్తే కేసీఆర్ నేరుగా నిరసన తెలపలేకపోయారని విమర్శించారు. రాష్ట్రంలోని అవినీతి, అక్రమాలు కేంద్రానికి తెలిసి ఉంటాయని, కేంద్రం ఎక్కడ ఇబ్బందులకు గురిచేస్తుందోనన్న ఆందోళనతోనే కేసీఆర్.. ప్రధానికి కేవలం వినతిపత్రం ఇచ్చి ఊరుకున్నారన్నారు. కేసీఆర్‌కు సిగ్గు, శరం, నైతికత లేవని ధ్వజమెత్తారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ మహాసభలు హన్మకొండలో సోమవారం ప్రారంభమయ్యారుు. సురవరం ఈ సభలను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఫ్యూడల్ విధానాలతో నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు ఉంటే తనను నిలదీస్తాయన్న అభద్రతతో... ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లోకి చేర్చుకుంటున్నారని ఆరోపించారు. దేవుళ్లను, పుష్కరాలను, యాగాలను ముందు పెడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. దేశంలో నియంతృత్వ ప్రభుత్వం దేశంలో నియంతృత్వ ప్రభుత్వం నడుస్తోందని సురవరం వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు బీజేపీ ప్రభుత్వం చేసిన ఘోర రాజకీయ తప్పిదమన్నారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకువస్తానన్న మోదీ.. రెండున్నరేళ్లరుునా తీసుకురాలేదన్నారు. దీనిపై ప్రజలకు సమాధానాలు చెప్పలేకే పెద్దనోట్లను రద్దు చేశారన్నారు. ‘‘ప్రధాని నిర్ణయంతో సామాన్య ప్రజలే ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేట్ శక్తులకు, సంపన్నులకు ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదు. పేదలు కూడ బెట్టుకున్న డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుంటే నోటీసులు జారీచేస్తున్నారు. ఫోన్ ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవాలని ప్రధాని చెబుతున్నారు. కూరగాయలు కొనడానికి, చెప్పులు కుట్టించడానికీ సెల్‌ఫోన్‌తో చెల్లింపులు చేస్తారా? సామాన్యుడు ఆన్లైన్ చెల్లింపులు చేయగలుగుతాడా? మెడపై తల ఉన్నవాడు, తలలో మెదడు ఉన్నవాడు ఇలాంటి ఆలోచన చేయడు’’ అని దుయ్యబట్టారు. మోదీవి ఫాసిస్టు ఆలోచనలు దేశంలో మతపరమైన దాడులు, దళి తులపై దాడులు పెరుగుతున్నాయని సుర వరం ఆందోళన వ్యక్తంచేశారు. గోరక్షణ పేరుతో ఊచకోత కోస్తున్నారన్నారు. ఆర్ఎస్ఎస్ అనే రిమోటు కేంద్రాన్ని నడిపి స్తోందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం యూపీఏ విధానాలనే అవలంభిస్తోందని, ఆయన ప్రధాని అయ్యాక ఇరుగుపొరుగు దేశాలతో సత్సంబంధాలు దెబ్బతిన్నాయ న్నారు. ‘‘మోదీ ఫాసిస్టు ఆలోచన, విధానా లతో ముందుకుపోతున్నారని, అందుకు వ్యతిరేకంగా సీపీఐ ముందుకు పోతుం దన్నారు. విదేశీయులను వెనక్కి పంపి స్తానని విష ప్రచారం చేసిన వంచకుడు, రేపిస్టు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యా డని అన్నారు. కమ్యూనిస్టులు శాస్త్రీయ ఆలోచనతో పోరాటాలు చేయాలని పిలుపు నిచ్చారు. నూతన ఆర్థిక, రాజకీయ పరిణా మాలు, డబ్బు ప్రభావం కమ్యూనిస్టు పార్టీలకు నష్టం కలిగిందని పేర్కొన్నారు. వరంగల్ మహాసభ పార్టీ బలమైన నిర్మా ణానికి వేదిక కావాలని ఆకాంక్షించారు. మహాసభల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, నేతలు పువ్వాడ నాగేశ్వర్ రావు, అజీజ్‌పాషా, గుండా మల్లేష్, పి.పద్మ పాల్గొన్నారు. -
ఎన్నికల సంస్కరణలపై అఖిలపక్షం
సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం డిమాండ్ సాక్షి, హైద రాబాద్: దేశంలో ఎన్నికల సంస్కరణలు తీసుకురావడంపై ప్రధాని నరేంద్ర మోదీ నిజంగా పట్టుదలతో ఉంటే వెంటనే అఖిల పక్ష భేటీని ఏర్పాటు చేయాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి డిమాండ్ చేశారు. దీనికి సమాంతరంగా కేంద్ర ఎన్నికల సంఘం సంస్కరణల ప్రక్రియను ప్రారంభించాలని, పార్లమెంట్ కూడా ప్రత్యేక స్థాయి సంఘం ద్వారా చర్చించి అవసరమైన సిఫార్సులు చేయాలన్నారు. ఈ ప్రక్రియ అంతటికీ నిర్ణీత కాల వ్యవధిని నిర్ణయించాలని సోమవారం ఓ ప్రకటనలో సూచించారు. ఎన్నికల సంస్కరణలు, డబ్బు నిర్వహించే పాత్రపై కేరళలోని కోజికోడ్‌లో మోదీ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుందన్నారు. వెంటనే ఎన్నికల సంస్కరణలను చేపట్టాలని సీపీఐ, ఇతర వామపక్షాలు ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సంస్కరణల్లో భాగంగా దామాషా ప్రాతిపదికన ప్రాతినిధ్యం అనేది భారత్‌కు సంబంధించి అత్యంత ముఖ్యమైనదని పేర్కొన్నారు. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని, పాత్రను నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పారు.