పౌరహక్కుల నేతలను విడుదల చేయాలి
ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్‌కు సురవరం లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన మేధావులు, పౌరహక్కుల నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేసి వారిని విడుదల చేయాలని ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్‌ను సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి కోరారు.
ఛత్తీస్ గఢ్‌లో క్షేత్రస్థాయి పరిస్థితుల అంచనాకు నిజ నిర్ధారణ కమిటీగా వచ్చిన పలువురిని నక్సలైట్లుగా ముద్ర వేసి జైలులో పెట్టారని లేఖలో పేర్కొన్నారు. వారిని ఏపీ పోలీసులు భద్రాచలంలో అరెస్ట్ చేసి ఛత్తీస్‌గఢ్ పోలీసులకు అప్పగించి నట్లు తెలిపారు. నిజంగా నక్సలైట్లయితే తాము ఛత్తీస్‌గఢ్‌కు వెళ్తున్నట్లు బహిరంగంగా ఎందుకు ప్రకటిస్తారని ప్రశ్నించారు.