'ఎంసెట్-2' లీకేజీలో మరొకరి అరెస్ట్ | Mohit Kumar Singh arrested in TS EAMCET-II-2016 medical entrance leakage case | Sakshi
Sakshi News home page

'ఎంసెట్-2' లీకేజీలో మరొకరి అరెస్ట్

Published Wed, Aug 17 2016 7:11 PM | Last Updated on Tue, Oct 9 2018 7:05 PM

Mohit Kumar Singh arrested in TS EAMCET-II-2016 medical entrance leakage case

హైదరాబాద్: తెలంగాణ నిర్వహించిన ఎంసెట్-2 పేపర్ లీకేజీ కేసులో ఓ బ్రోకర్ను అదుపులోకి తీసుకున్నారు. యూపీకి చెందిన మోహిత్ కుమార్ సింగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సీఐడీ ఐజీ సౌమ్య మిశ్రా ఓ ప్రకటనలో తెలిపారు. యూపీ బలంద్ షహర్ జిల్లాకు చెందిన మోహిత్ కుమార్ న్యూఢిల్లీలో ఎడ్యూకేషనల్ కన్సల్టెంట్ గా పనిచేస్తుండేవాడని వెల్లడించారు.

తెలంగాణ ఎంసెట్-2(మెడికల్) పేపర్ ను ఆరుగురు విద్యార్థులకు లీక్ చేశాడని ఆరోపణలున్నాయి. కోల్ కతా కేంద్రంగా చేసుకుని మరికొందరు బ్రోకర్లు, ఇతర వ్యక్తులతో కలసి ఎంసెట్ పేపర్ లీక్ చేశాడన్న ఆరోపణలతో మోహిత్ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఎంసెట్-2 మెడికల్ పేపర్ లీక్ కుంభకోణం కారణంగా మూడోసారి ఈ ఎంట్రెన్స్ టెస్టు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement