దారుణాలపై రణ భేరి
ధర్మాగ్రహం... ధర్నాగ్రహం... రుణాలు మాఫీ చేస్తామని చెప్పి బురిడీ కొట్టించిన బాబు దారుణాలపై రణ భేరి... ఇది దగాపడ్డ అన్నదాతల పక్షాన జగనన్న చేపట్టిన నిరసన దీక్ష... అందుకే విశాఖ కలెక్టరేట్ వద్ద శుక్రవారం ప్రతిపక్ష నేత తలపెట్టిన ధర్నాకు రైతులు, డ్వాక్రా మహిళలు వెల్లువలా వచ్చారు. భారీ పోలీసు బలగాలు మోహరించి, ఇనుప కంచెలతో అడ్డగించినా నినాదాల హోరుతో దూసుకొచ్చారు.
పింఛన్లు కోల్పోయిన బాధితుల కోసం, నిరుద్యోగ భృతి కోరుతున్న యువత కోసం గొంతెత్తిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో గొంతు కలిపారు. ఎన్నో ఆశలు కల్పించి, ఇప్పుడు ఎన్నికల హామీలనే మాఫీ చేస్తున్న మాయదారి చేష్టలపై యుద్ధం ప్రకటించారు.
-సాక్షి, విశాఖపట్నం