కూతురితో వ్యభిచారం చేయిస్తున్న తల్లి! | mother forces daughter to go for prostitution | Sakshi
Sakshi News home page

కూతురితో వ్యభిచారం చేయిస్తున్న తల్లి!

Published Thu, Sep 18 2014 10:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM

కూతురితో వ్యభిచారం చేయిస్తున్న తల్లి!

కూతురితో వ్యభిచారం చేయిస్తున్న తల్లి!

కన్నతల్లే బలవంతంగా కూతురితో వ్యభిచారం చేయిస్తున్న ఘోరమైన సంఘటన హైదరాబాద్ పాతబస్తీలో బయటపడింది. యాకుత్పురా ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికను ఆమె తల్లి, బావ కలిసి బలవంతంగా వేర్వేరు ప్రాంతాలకు పంపుతూ ఆమెతో వ్యభిచారం చేయిస్తున్నారు. ఆమె గురువారం తెల్లవారుజామున ఎలాగోలా ఇంట్లోంచి తప్పించుకుని పారిపోయి వివిధ రైల్వే స్టేషన్లలో తలదాచుకుంటూ చివరకు పీయూసీఎల్ కార్యాలయానికి చేరుకుని అక్కడ ఆశ్రయం పొందింది.

తనను చాలా కాలంగా ఫాంహౌస్లు, హోటళ్లకు పంపుతున్నారని, పుణె, బాంబే, గోవా.. ఇలా అనేక ప్రాంతాల్లో తనతో వ్యభిచారం చేయిస్తున్నారని ఆమె వాపోపయింది. ఇంటికి వెళ్తే చంపేస్తారని కూడా ఆమె భయపడుతోంది.  రెండురోజుల క్రితం గోవా పంపగా, అక్కడి నుంచి గురువారం తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో పాతబస్తీకి చేరుకుంది. ఇంటి నుంచి 5 గంటల సమయంలో పారిపోయి బయటకు రాగలిగింది. దుబాయ్ షేక్ల వద్దకు కూడా తనను పంపుతున్నారని ఆమె వాపోయింది. కన్నతల్లే ఇలా చేయడం అత్యంత దారుణమని పీయూసీఎల్ నాయకురాలు జయ వింధ్యాల పేర్కొన్నారు.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement