
హోదా కోసం ‘తప్పెటగుళ్లు’
టీడీపీ ఎంపీ శివప్రసాద్ నిరసన..
సాక్షి, న్యూఢిల్లీ: విభజన హామీలు అమలు చేయాలంటూ మంగళవారం ఢిల్లీలో తప్పెటగుళ్ల వేషధారణలో టీడీపీ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఆందోళన చేశారు. ఈ సందర్భగా ఏపీకి ఇచ్చిన హామీలపై శివప్రసాద్ పాట పాడి వినిపించారు. ప్రత్యేక హోదా కోసం వేచి చూసి ఓపిక నశిస్తోందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. హోదాకు బదులు ప్యాకేజీ ఇచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోందని, అయితే హోదా కోసమే తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. హోదా సాధనకు వైఎస్ జగన్ సహా ఏ పార్టీ పోరాటం చేసినా సహకరిస్తామని వెల్లడించారు.