మ్యూజికాలజిస్ట్ రాజాకు డాక్టరేట్
హైదరాబాద్ : తెలుగు సినీ సంగీతానికి వ్యాసాల ద్వారా, రివ్యూ ల ద్వారా తన పరిశోధనలను, విశ్లేషణలను అందించడమే కాకుండా, తన వద్ద గల సమాచారంతో సినీ ప్రముఖులకు కూడా సేవలను అందిస్తున్న మ్యూజికాలజిస్ట్ రాజాకు గౌరవ డాక్టరేట్ లభించింది. అంతర్జాతీయంగా 77 దేశాలలో గుర్తింపు కలిగిన అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ సంస్థ ఈ నెల 25న బెంగళూరులో ఆయనకు ఈ డాక్టరేట్ని అందజేసింది.
హైదరాబాద్‌కు చెందిన రాజా నలభై ఏళ్లుగా సినిమా పాటలపై పరిశోధనలు చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ భాషలకు చెందిన నలభై వేలకు పైగా పాటల సమాచారాన్ని వెలికితీశారు. తన పరిశోధనకు సంబంధించిన పాటలను రాజా మ్యూజిక్ బ్యాంక్.కామ్ (rajamusicbank.com) వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నారు.