మ్యూజికాలజిస్ట్ రాజాకు ఉగాది పురస్కారం
హైదరాబాద్: తెలుగు చలన చిత్ర సంగీతంపై విశ్లేషణలు చేస్తున్న మ్యూజికాలజిస్ట్ రాజాకు ఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం అందజేసింది. హైదరాబాద్‌కు చెందిన రాజా నలభై ఏళ్లుగా సినిమా పాటలపై పరిశోధనలు చేస్తున్నారు, తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ భాషలకు చెందిన నలభై వేలకు పైగా పాటల సమాచారాన్ని వెలికితీశారు. మహారాష్ట్ర గవర్నర్ సీ.హెచ్. విద్యాసాగరరావు చేతుల మీదుగా ఉగాది పుర స్కారంతో పాటు విశ్వప్రతిభా పురస్కార్ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ–‘‘ తెలుగు సినిమా పాటలకు సంబం«ధించిన పూర్తి వివరాలు ప్రతి శ్రోతకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ పరిశోధన ప్రారంభించానన్నారు. తన పరిశోధనకు సంబంధించిన పాటలను రాజా మ్యూజిక్ బ్యాంక్.కామ్ (rajamusicbank.com) వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా తెలుగు సినిమా పాటలపై ప్రభుత్వం ఓ కమిటీ చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. తన జీవితం తెలుగు సినిమా పాటకు అంకితమని ఆయన పేర్కొన్నారు.