అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు: నల్లా | Nalla Suryaprakash as YSRCP candidate for Warangal Lok sabha | Sakshi
Sakshi News home page

అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు: నల్లా

Published Tue, Nov 3 2015 1:22 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM

అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు: నల్లా - Sakshi

అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు: నల్లా

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చిందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యాలయంలో పొంగులేటి...నల్లా సూర్యప్రకాశ్‌కు బీ ఫాం అందచేశారు.

 

ఈ సందర్భంగా నల్లా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని ఆయన అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలే తమ ప్రచారాస్త్రాలుగా ప్రజల్లోకి వెళతామని నల్లా తెలిపారు. రైతులు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతుల బలవన్మరణాలను కనీసం నమోదు కూడా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement