రెండు రోజుల్లో అభ్యర్ధి ప్రకటన: పొంగులేటి | will declare the ysrcp candidate with in two days, says Ponguleti srinivasa rao | Sakshi
Sakshi News home page

రెండు రోజుల్లో అభ్యర్ధి ప్రకటన: పొంగులేటి

Published Sat, Oct 31 2015 7:27 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM

రెండు రోజుల్లో అభ్యర్ధి ప్రకటన: పొంగులేటి - Sakshi

రెండు రోజుల్లో అభ్యర్ధి ప్రకటన: పొంగులేటి

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నిక పోరుకి సిద్ధమైన  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ....అభ్యర్ధి  ఎంపిక కోసం కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అభ్యర్ధి ఎంపికపై నేతలందరితో సమాలోచనలు జరిపి, అభిప్రాయాలను తెలుసుకున్నారు.  

ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ....పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో ఒకటి, రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. ప్రచారానికి వైఎస్ జగన్‌తో పాటు ఆయన సోదరి షర్మిల వస్తారని తెలిపారు.  కేసీఆర్ అప్రజాస్వామిక విధానాలే ఆయుధంగా ....ఎన్నికల బరిలో దిగుతామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement