హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఎలాంటి ఫెస్టివల్స్కు అనుమతి లేదని ఓయూ రిజిస్ట్రార్ బుధవారం తెలిపారు. ఓయూలో ఫెస్టివల్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని విద్యార్థులను, విద్యార్థి సంఘాల నాయకులను ఆయన హెచ్చరించారు. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే విద్యార్థుల అడ్మిషన్లు రద్దుచేస్తామని ఓయూ రిజిస్ట్రార్ వెల్లడించారు. ఈ నెల 10న వర్సిటీలో ‘బీఫ్ ఫెస్టివల్ ’ నిర్వహించి తీరుతామని డెమోక్రటిక్ కల్చరల్ ఫ్రంట్ (25 విద్యార్థి సంఘాల కూటమి) స్పష్టం చేసిన విషయం అందరికీ విదితమే.