
ఫేస్‌బుక్‌తో అవన్నీ ఇప్పుడు సులభం
ప్రయోజనం
హైదరాబాద్ పోలీసులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు. రోజుల తరబడి నిరీక్షించి చేసుకుంటున్న పనులను క్షణాల్లో మన ఇంట్లో ఉండే చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. పలు రకాల అప్లికేషన్లు, పాస్‌పోర్టు స్టేటస్, పోగొట్టుకున్న వాహనాల వివరాలు, మన స్థానిక పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంటున్న మార్పులు తదితర వివరాలను ఫేస్‌బుక్ ద్వారా నిత్యం అందుబాటులో ఉంచుతున్నారు. దీనిద్వారా సమయం, డబ్బు వృథా కాకుండా నగరవాసుల మన్ననలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్నివర్గాల ప్రజల్లో ఫేస్‌బుక్ వినియోగం నానాటికీ పెరిగిపోవడమే ప్రధాన కారణం. - గాజులరామారం
ఫేస్‌బుక్‌లో అప్‌డేట్స్...
ప్రజలతో నిత్యం సత్సంబంధాలు కొనసాగించేందుకు హైదరాబాద్ పోలీస్‌వారు అన్ని పోలీస్‌స్టేషన్‌లకు ఫేస్‌బుక్ పేజీలను ఏర్పాటు చేశారు. ఇందు కోసం http://www.hyderabadpolice.gov.in/Main/facebook.htm లింక్‌ను క్లిక్ చేయాలి.
ఇక్కడ మీ ప్రాంత పోలీస్ స్టేషన్‌ను ఎంచుకోండి. అనంతరం ఇక్కడ ఆ పోలీస్ స్టేషన్‌ను లైక్ చేస్తే అక్కడ జరుగుతున్న అప్‌డేట్స్ అన్నీ మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
పాస్‌పోర్ట్ వెరిఫికేషన్...
పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకుని ఉంటే వారి పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ స్థితిని సులభంగా తెలుసుకోవచ్చు. దీని కోసం http://www.hyderabadpolice.gov.in/Main/PassStatus.htm లింక్‌ను క్లిక్ చేయాలి. ఇక్కడ ‘‘పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అప్లికేషన్’’ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు వెరిఫికేషన్ పూర్తయిన వారి వివరాలను పీడీఎఫ్ ఫైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పోయిన వాహనాల సమాచారం...
http://www.hyderabadpolice.gov.in/Main/UnclaimedAbandoned%20vehicles.pdf … క్లిక్ చేస్తే పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనాల వివరాలు తెలుసుకోవచ్చు.
పోలీసు అనుమతి కోసం...
పలు కార్యక్రమాలకు మనం లౌడ్ స్పీకర్లు, డీజేలు వినియోగిస్తాం. అయితే ఇలాంటివి స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇందుకోసం తప్పనిసరిగా పోలీసుల అనుమతి ఉండాలి. పోలీసుల అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోవాలి.